Wednesday, January 22, 2025

21న ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించనున్న సిఎం కెసిఆర్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణలో మరికొద్ది నెలల్లో ఎన్నికలు జరగనుండగా, బీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీలు ఎన్నికల ప్రణాళికలు రచించడంతో రంగం సిద్ధమవుతోంది. కొత్త పరిణామంలో బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ తన తొలి జాబితాను ప్రకటించబోతున్నట్లు అర్థమవుతోంది. ఈ నెల 21న ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించనున్నట్లు సమచారం. రానున్న ఎన్నికలకు 87 మంది ఎమ్మెల్యే అభ్యర్థులను కేసీఆర్ ప్రకటించనున్నారని, ఈ జాబితాలో ఎక్కువ మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలే ఉంటారని తెలుస్తోంది. కేవలం 10 మంది ఎమ్మెల్యేలు మాత్రమే కొత్త పోటీలో ఉంటారని టాక్ వినిపిస్తోంది.

వచ్చే ఎన్నికలకు మొత్తం 3/4వ వంతు ఎమ్మెల్యే అభ్యర్థులను ఇప్పటికే ఖరారు చేశారు బిఆర్ఎస్ బాస్. కేసీఆర్ స్వయంగా కామారెడ్డి నియోజకవర్గం నుంచి పోటీ చేసే అవకాశం ఉందని వస్తున్న వార్తల మధ్య ఈ జాబితా ఊపందుకుంది. ఆయన గజ్వేల్‌లోనే బరిలోకి దిగుతారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఆగస్టు 21న కేసీఆర్ తన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితాను ప్రకటించడంతో గందరగోళానికి తెరపడే అవకాశం ఉంది. అటు ఈ నెలాఖరులోగా కాంగ్రెస్ తన ఎమ్మెల్యే అభ్యర్థుల మొదటి జాబితాను కూడా ప్రకటించే అవకాశం ఉందని పలువురు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News