Monday, December 23, 2024

ఉపాధ్యాయ ఎమ్మెల్సీ బరిలో 21 మంది అభ్యర్థులు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : మహబూబ్‌నగర్, -రంగారెడ్డి, -హైదరాబాద్ జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గ స్థానానికి 21 మంది బరిలో నిలిచారని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్‌రాజ్ తెలిపారు. శుక్రవారం నామినేషన్ల పరిశీలన పూర్తి చేశారు. మొత్తం 21 మంది అభ్యర్థులు 57 సెట్ల నామినేషన్లు దాఖలు చేయగా.. వారి పత్రాలు నిబంధనల మేరకు ఉన్నట్లు ఎన్నికల అధికారులు నిర్ధారించారు. ఈ నెల 27న నామినేషన్ల ఉపసంహరణ, మార్చి 13న పోలింగ్, 16న లెక్కింపు ఉంటుందని వికాస్‌రాజ్ తెలిపారు. హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి రెండు నామినేషన్లు దాఖలు చేశారని, ఇండిపెండెంట్ అభ్యర్థిగా మహమ్మద్ రహీంఖాన్ నామినేషన్ తిరస్కరించినట్లు తెలిపారు. స్థానిక సంస్థల బరిలో ఎఐఎంఐఎం పార్టీ తరఫున మీర్జా రహమత్‌బేగ్ ఒకరే నిలిచారని తెలిపారు. ఉపసంహరణ గడువు ముగిసిన వెంటనే ఆయన ఏకగ్రీవంగా ఎమ్మెల్సీగా ప్రకటించనున్నారు.
* ఉపాధ్యాయ నియోజకవర్గ ఓటర్ల జాబితా విడుదల…
మహబూబ్‌నగర్-, రంగారెడ్డి, -హైదరాబాద్ ఉపాధ్యాయ నియోజకవర్గ తుది ఓటర్ల జాబితాను ఎన్నికల సంఘం విడుదల చేసింది. తొమ్మిది జిల్లాల పరిధిలో 126 పోలింగ్ కేంద్రాలతో పాటు అదనంగా 11 కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. మొత్తం ఓటర్ల సంఖ్య 29720 మంది కాగా.. వారిలో పురుషులు 15472 మంది, మహిళలు 14246, ట్రాన్స్ జెండర్ ఇద్దరు ఉన్నట్లు పేర్కొన్నారు. ఓటర్ల జాబితాపై 4237 ఫిర్యాదులు రాగా.. 2177 స్వీకరించగా, 2060 తిరస్కరించినట్లు తెలిపారు. అభ్యంతరాలు 1481 వచ్చాయని వాటిలో 1283 స్వీకరించినట్లు, 198 తిరస్కరించనట్లు తెలిపారు. తుది ఓటర్ల జాబితాను సిఈఓ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినట్లు ఆయన తెలిపారు.
* జిల్లాల వారీగా పోలింగ్ కేంద్రాల సంఖ్య, ఓటర్ల వివరాలు..
* జిల్లా ప్రధాన పోలింగ్ కేంద్రాలు అదనపు కేంద్రాలు మొత్తం పురుషులు మహిళలు ట్రాన్స్‌జెండర్ మొత్తం

1 మహబుబ్‌నగర్ 13 2 15 1881 1580 0 3461
2 నాగర్‌కర్నూల్ 14 0 14 1169 653 0 1822
3 వనపర్తి 6 1 7 861 474 0 1335
4 జోగులాంబ గద్వాల్ 11 0 11 562 315 0 877
5 నారాయణ్‌పేట్ 5 0 5 424 240 0 664
6 రంగారెడ్డి, 27 4 31 4870 4315 1 9186
7 వికారాబాద్, 18 0 18 1232 658 0 1890
8 మేడ్చల్ మల్కాజిగిరి 10 4 14 3038 3498 0 6536
9 హైదరాబాద్ 22 0 22 1435 2513 1 3949
మొత్తం 126 11 137 15472 14246 2 29720

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News