Saturday, January 18, 2025

బూడిదయిన 21 కార్లు.. ఢిల్లీలో కలకలం

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో సోమవారం ఓ బహుళ అంతస్తుల భవనం పార్కింగ్ ప్రదేశంలో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో 21 కార్లు బూడిదయ్యాయి. వెస్ట్‌ఢిల్లీలోని సుభాష్ నగర్‌లో ఈ ఉదయం ఈ ప్రమాదం చోటుచేసుకుందని అధికారులు తెలిపారు. సమాచారం తెలియగానే అక్కడికి అగ్నిమాపక శకటాలు పెద్ద సంఖ్యలో చేరాయి.

అగ్ని ప్రమాదానికి కారణాలు వెంటనే తెలియలేదు. తాము ఈ ప్రాంతంలోని సిసిటీవీ ఫుటేజ్‌లను, ఘటనా స్థలిలోని సాక్షాధారాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మంటలు చెలరేగడానికి ముందు అక్కడ ఓ వ్యక్తి అనుమానాస్పదంగా సంచరించినట్లు సిసిటీవీ ఫుటేజ్‌ల సాయంతో గుర్తించారు. ఈ వ్యక్తిని గుర్తించారు. అదుపులోకి తీసుకునేందుకు పలు పోలీసు బృందాలు రంగంలోకి దిగాయి. ఇది విద్రోహ చర్య అనే అనుమానాలు కూడా తలెత్తుతున్నాయి.

తెల్లవారుజామున నాలుగు గంటల ప్రాంతంలో చెలరేగిన మంటలు రెండు గంటల తరువాత అదుపులోకి వచ్చాయి. పార్కింగ్ ప్లేస్‌లోని వాహనాలు దగ్ధం అయ్యాయి. ఢిల్లీ బిజెపి విభాగం ఈ ఘటనపై తీవ్రంగా స్పందించింది. వెంటనే తగు విధంగా చర్యలు తీసుకోవాలని బిజెపి వర్కింగ్ ప్రెసిడెంట్ వీరేంద్ర సచ్‌దేవా డిమాండ్ చేశారు. ప్రమాదం జరిగిన బహుళ అంతస్తుల భవనం పార్కింగ్ స్థలాన్ని ఆయన సందర్శించారు. తాను ఢిల్లీ మున్సిపల్ అధికారులతో ఘటనపై మాట్లాడుతానని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News