హైదరాబాద్ ఒఆర్‌ఆర్ వద్ద ఆదివారం నాడు పట్టుబడిన 3,400కిలోల గంజాయి
ముగ్గురి అరెస్టు, విశాఖ ఏజెన్సీ నుంచి ముంబైకి తరలిస్తుండగా పట్టివేత
మన తెలంగాణ/హైదరాబాద్: నగర శివారులోని ఒఆర్‌ఆర్ వద్ద ఆదివారం నా డు రూ. 21 కోట్ల విలువ చేసే 3,400 కిలోల గంజాయిని ఎన్‌సిబి అధికారులు స్వాధీనం చేసుకుని మహారాష్ట్రకు చెందిన ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. ఈక్రమంలో ఒఆర్‌ఆర్ మీదుగా వెళుతున్న ట్రక్కును తనికీ చేయగా పూలమొక్కల చా టున 24 సంచులలో గంజాయి తరలిస్తున్నట్లు గుర్తించామని, విశాఖ ఎజెన్సీ నుంచి ముంబైకి తరలిస్తున్న క్రమంలో పట్టుకున్నట్లు ఎన్‌సిబి అధికారులు వివరించారు.
విశాఖ ఎజెన్సీలో గంజాయి విక్రయించే వారితో ఒప్పదం చేసుకుని మహారాష్ట్రలోని ముంబైకి ని తరలిస్తుండగా మహారాష్ట్రకు చెందిన ముగ్గురిని అరెస్ట్ చేసినట్లు ఎన్‌సీబీ అధికారులు చెప్పారు. ట్రాక్కులో పైకి పూలమొక్కలు తరలిస్తున్నట్లుగా కనిపించే విధంగా నిందితులు జాగ్రత్తలు తీసుకున్నారన్నారు. గతంలో కూడా నిందితులపై గంజాయి తరలింపు కేసులున్నట్లు ఎన్‌సిబి అధికారుల అధికారుల ప్రాధమిక విచారణలో వెల్లడైంది. ఇదిలావుండగా ఈ ఏడాది ఇప్పటివరకు 7,500 కిలోల గంజాయిని పట్టుకుని గంజాయి తరలింపు కేసులు నమోదు చేసి 25 మందిని అరెస్ట్ చేసినట్లు ఎన్‌సీబీ అధికారులు తెలిపారు.