- Advertisement -
అఫ్గానిస్థాన్ లోని హెల్మాండ్ ప్రావిన్స్‌లోని గెరాష్క్ జిల్లాలో ఆదివారం జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో 21 మంది మృతి చెందారు. 38 మంది గాయపడ్డారు. కాందహార్ నుంచి హెరత్ ప్రావిన్స్‌కు వెళ్తున్న బస్సును బైక్ ఢీకొట్టడంతో బస్సు అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న ఆయిల్ ట్యాంకర్ పైకి దూసుకెళ్లింది. గాయపడిన వారిలో 11 మంది పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో వారిని మెరుగైన వైద్య చికిత్స కోసం జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తున్నట్టు అధికారులు తెలిపారు.
- Advertisement -