Monday, December 23, 2024

ఫేక్ డాక్యుమెంట్లతో 21 లక్షల సిమ్‌కార్డుల జారీ

- Advertisement -
- Advertisement -

దేశవ్యాప్తంగా ఫేక్ డాక్యుమెంట్లతో సుమారు 21 లక్షల సిమ్ కార్డులు జారీ అయినట్లు తమ విశ్లేషణలో తేలిందని డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ తెలిపింది. ఈ మేర కు ఎయిర్‌టెల్, ఎంటిఎన్‌ఎల్, బిఎస్‌ఎన్‌ఎల్, జియో, వొడా ఫోన్ సంస్థలకు అలర్ట్ జారీ చేసినట్లు వెల్లడించింది. కొన్ని అనుమానాస్పద నంబర్ల జాబితాను విడుదల చేసి వాటి పత్రాలను తక్షణమే రీవెరిఫికేషన్ చేయాలని ఆదేశించినట్లు పేర్కొంది. రీవెరిఫికేషన్‌లో అవి బోగస్ ప్రూఫ్‌లని తేలితే సిమ్‌లను రద్దు చేయాలని డిఓటి సూచించింది. సంచార్ సాతీ కార్యక్రమం కింద దేశవ్యాప్తంగా 114 కోట్ల మొబైల్ కనెక్షన్‌లను డిఓటికి చెందిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డిజిటల్ ఇంటెలిజెన్స్ విభాగం విశ్లేషించింది. వాటిలో 21 లక్షల సిమ్‌కార్డులను యాక్టివేట్ చేసుకోవడానికి తప్పుడు ధ్రువీకరణ పత్రాలను సమర్పించినట్లు గుర్తించింది.

వాటిలో చాలా సిమ్‌లను సైబర్ నేరాలకు వాడుతున్నట్లు అనుమానిస్తోంది. ఇవి నిరూపితమైతే ఆ సిమ్ కార్డులను రద్దు చేయడంతోపాటు, వాటిని వినియోగించిన ఫోన్స్ కూడా పనిచేయకుండా చేస్తామని ఎఐ అండ్ డిఐయూ డైరెక్టర్ జనరల్ ముఖేశ్ మంగళ్ వెల్లడించారు. దేశ వ్యాప్తంగా 1.92 కోట్ల మంది తొమ్మిది సిమ్‌కార్డుల పరిమితికి మించి కనెక్షన్లు తీసుకొన్నారు. వారిలో చాలామంది సర్వీస్ ప్రొవైడర్లకు ఇచ్చిన డేటాలో తప్పులున్నాయి. అసలు వినియోగదారులకు తెలియకుం డా వారి పేరిట తీసుకొనే సిమ్ కార్డులను గుర్తించి వాటిని రద్దు చేయించడానికి సంచార్ సాతీ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఆయా నెంబర్లపై దర్యాప్తు సహా ఇతర చర్యలకు డిఓటి ఇప్పటికే సర్వీస్ ప్రొవైడర్లకు డెడ్‌లైన్ విధించింది. వీటిని పూర్తిచేసే క్రమంలో భారీ సంఖ్యలో సిమ్‌కార్డు లు డిస్‌కనెక్ట్ అవుతాయని ప్రభుత్వం భావిస్తోంది.

ఇక ఈ మొత్తం ఆపరేషన్‌లో ఎఐ అండ్ డిఐయూ సంస్థ ఇతర చట్ట సంస్థలతో కలిసి పనిచేస్తోంది. ఇప్పటివర కు 1.8 లక్షల మొబైల్ హ్యాండ్ సెట్లను పనిచేయకుం డా చేశామని అధికారులు చెబుతున్నారు. మరోవైపు తమిళనాడు డిజిపి శంకర్ జివాల్ మాట్లాడుతూ 90 శాతం సైబర్ నేరాలకు తప్పుడు సిమ్‌కార్డులనే వాడుతున్నట్లు పేర్కొన్నారు. పోలీసులు తమను ట్రాక్ చేయడానికి వీల్లేకుండా వారు వీటిని వినియోగిసున్నారని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News