Wednesday, January 22, 2025

పుట్టిన రోజు వేడుకలో అగ్నిప్రమాదం: 21 మంది మృతి

- Advertisement -
- Advertisement -

 

గాజా: జన్మదిన వేడుకలు జరుగుతుండగా అగ్నిప్రమాదం చోటుచేసుకోవడంతో 21 మంది మృతి చెందిన సంఘటన గాజాలోని బజాలియాలో జరిగింది. మృతి చెందిన వారిలో 17 మంది ఒకే కుటుంబానికి చెందిన వారు ఉన్నారు. మూడంతస్థుల భవనంలో పుట్టిన రోజు వేడుకులు ఘనంగా జరుగుతున్నాయి. అదే సమయంలో ఒక వైపున భారీ మంటలు అంటు కోవడంతో ఘటనా స్థలంలోనే 21 మంది చనిపోయారు. మృతులలో ఒకే కుటుంబానికి చెందిన 17 మంది ఉన్నారు. ఇంట్లో నిల్వ ఉంచిన పెట్రోల్ వలనే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఫర్నిచర్ ఎక్కువగా ఉండడంతో మంటలు చెలరేగాయని స్థానికులు తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News