Friday, December 20, 2024

అనుమానస్పద స్థితిలో 21 నెమళ్లు మృతి

- Advertisement -
- Advertisement -

చేర్యాల: అనుమానస్పద స్థితిలో 21 నెమళ్లు మృతి చెందిన సంఘటన సిద్దిపేట జిల్లా చేర్యాల పట్టణంలోని తహశీల్దార్ కార్యాయలం సమీపంలో ఉన్న వ్యవసాయ బావి వద్ద చోటు చేసుకుంది. స్థానిక రైతు దాసరి అనిల్ కుమార్ ఫారెస్ట్ ఆఫీసర్లకు సమాచారం అందించడంతో సంఘటన స్థలాన్ని ఫారెస్ట్ డిప్యూటీ రేంజర్ శ్రీనివాస్, బీట్ ఆఫీసర్ రాముడు ప్రాంతానిని పరిశీలించారు.

మృతి చెందిన నెమళ్లను వెటర్నరీ ఆసుపత్రికి తరలించారు. ఈ సందర్భంగా వెటర్నరి డాక్టర్ విజయ సారథి మాట్లాడుతూ పోస్టు మార్టం నిర్వహించిన అనంతరం శాంపిల్స్‌ను ఫోరెనిక్స్ ల్యాబ్‌కు పంపించడం జరుగుతుందని ఫోరెనిక్స్ రిపోర్టు ఆధారంగా నెమళ్లు మృతి గల కారణాలు తెలుస్తాయని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News