Sunday, December 22, 2024

పేకాట ఆడుతున్న 21 మంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు అరెస్టు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా నార్సింగిలో పేకాట ఆడుతున్న రియల్ ఎస్టేట్ వ్యాపారులు అరెస్టు చేశారు. రియల్టర్స్  పేకాట ఆడుతూ రెడ్ హ్యాండెడ్ గా ఎస్ఒటి పోలీసులకు పట్టుబడ్డారు. పుప్పాల్ గూడ కంట్రీ ఫామ్ అపార్ట్‌మెంట్ లోని ఓ ప్లాట్ పై మాదాపూర్ ఎస్ఒటి పోలీసుల దాడులు నిర్వహించారు. చేవెళ్ళకు చెందిన 21 మంది రియల్ ఎస్టేట్ వ్యాపారులను ఎస్ఒటి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పేకాట రాయుళ్ల వద్ద నుంచి 1లక్ష 50 వేల నగదు, 21 మొబైల్ ఫోన్లు, 6 కార్లును స్వాధీనం చేసుకున్నారు. గేమింగ్ యాక్ట్ కింద నార్సింగి పోలీసుల కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News