Thursday, January 23, 2025

హజ్ యాత్రకు 21 బృందాలు పయనం

- Advertisement -
- Advertisement -
రోజుకూ 3 ఫ్లైట్లు… ఈ నెల 22 వరకు ప్రయాణం
హజ్ కమిటి ఆధ్వర్యంలో విస్తృత ఏర్పాట్లు

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రం నుండి ముస్లిం సోదరులు హజ్ యాత్ర కొనసాగుతూనే ఉంది. ఈ నెల 7న హైదరాబాద్ నుండి జిద్దాకు ప్రారంభమైన హజ్ పిలిగ్రిమ్స్ ప్రత్యేక విమానాలు ఈ నెల 22 వరకు నడువనున్నాయి. ఇప్పటి వరకు రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి ప్రత్యేక విమానాల ద్వారా హజ్ యాత్రికుల 21 బృందాలు జిద్దా కు బయలు దేరాయి. ఒక్కో విమానంలో 150 మంది చొప్పున ఇప్పటి వరకు 3,150 మంది హజ్ యాత్రకు బయలు దేరారు. హజ్ కమిటీ ద్వారా ఎంపికైన 5,278 మందితో పాటు వెయిటింగ్ లీస్ట్‌లో ఉన్న వారిలో 1244 మంది మొత్తం 6,522 మంది మన రాష్ట్రం నుంచి హజ్ యాత్రకు వెళుతున్నారు. వెయిటింగ్ లీస్టులో ఉన్న మరో 300 నుండి 400 మంది హజ్ యాత్రకు ఎంపికయ్యే అవకాశం ఉన్నట్లు హజ్ కమిటీ వర్గాలు పేర్కొన్నాయి.

ప్రతిరోజు మూడు హజ్ యాత్రికుల ప్రత్యేక విమానాలు జిద్దాకు బయలు దేరుతున్నాయి. హజ్‌కు బయలు దేరే యాత్రికులు తమ విమానం బయలు దేరడానికి 48 గంటల ముందు నాంపల్లి లోని హజ్ కమిటీలో రిపోర్ట్ చేయాలని అధికారులు పేర్కొంటున్నారు. జిల్లాల నుండి వచ్చే యాత్రికులకు హజ్ హౌస్‌లోనే ఉచిత భోజన వసతి సౌకర్యాలను హజ్ కమిటి కల్పిస్తోంది. హజ్ కు వెళ్ళే యాత్రికులతో పాటు వారిని సాగనంపడానికి కుటుంబ సభ్యులు అందరూ తరలి వస్తుండడంతో వారికి సౌకర్యాలు కల్పించడంలో హజ్ కమిటి అధికారులు ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది. కేంద్ర ప్రభుత్వం హజ్ యాత్రికులను తరలించేందుకు తెలంగాణ రాష్ట్రానికి విస్టారా ఎయిర్‌లైన్స్ (టాటా) విమానాలను కేటాయించడం, గత ఏడాదితో పోల్చితే హజ్ కోటా రెండింతలు పెరగడం, విమానాల కెపాసిటి 150కే పరిమితం కావడంతో రోజు మూడు హజ్ ప్రత్యేక విమానాలు నడిపినా ఈ నెల 22 వరకు నడుపాల్సి వస్తోందని అధికారులు అంటున్నారు. గతంలో నడిపిన ప్రత్యేక విమానాల్లో ఒక్కో విమానంలో 330 నుండి 450 ప్రయాణీకులు బయలు దేరే వారు. దీంతో హజ్ యాత్ర ప్రయాణం తక్కువ కాలంలోనే ముగిసేదని అధికార వర్గాలు పేర్కొన్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News