Sunday, December 22, 2024

21 ఏళ్ల యువకుడితో 52 ఏళ్ల మహిళ పెళ్లి… వైరల్

- Advertisement -
- Advertisement -

 

యువకులు తన కంటే చిన్నదైన అమ్మాయిని పెళ్లి చేసుకుంటారు. మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ తన కంటే రెండేళ్లు వయసు పెద్ద ఉన్న అంజలిని పెళ్లి చేసుకున్నాడు. తమిళనాడులో ఓ టీచర్ తన స్టూడెంట్‌ను పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. తాజాగా 52 ఏళ్ల మహిళ, 21 ఏళ్ల యువకుడిని పెళ్లి చేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రేమకు వయసుకు సంబంధంలేదని, ఏ వయసులోనైనా ప్రేమ పుడుతుందని వధువు, వరుడు సమాధానం ఇచ్చారు.  తాము కలిసి ఉండడం సంతోషంగా ఉందన్నారు. తన కంటే యువకుడిని ఎక్కువగా నమ్మానని తెలిపింది. ఇద్దరు ఒడిశా రాష్ట్రంలో పెళ్లి చేసుకున్నట్టు సమాచారం. యువకుడి వయసు కంటే మహిళ వయసు 31 ఏళ్లు ఎక్కువగా ఉండడంతో ప్రజలు అవాక్కవుతున్నారు. కలికాలం కాబట్టి ఇలాంటివి జరుగుతున్నాయని సోషల్ మీడియాలో నెటిజన్లు విమర్శలు చేస్తున్నారు. మనవుడి వయసు ఉన్న కుర్రాడితో పెళ్లి ఏంటని కామెంట్లు చేస్తున్నారు. సదరు మహిళ అభం శుభం తెలియని కుర్రాడి జీవితంతో ఆడుకుంటుందన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News