Thursday, January 23, 2025

అసెంబ్లీ ఎన్నికల బరిలో 2,100 మంది

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: ప్రధాన పార్టీలకు చెందిన అగ్రనేతలు బుజ్జగింపులు, హామీలు ఇవ్వ డంతో పలుచోట్ల తిరుగుబాట్లు దారిలోకి వచ్చా రు. ఈనెల 3వ తేదీ నుంచి 10వ తేదీ వరకు నా మినేషన్లు వేసిన రెబల్స్ బుధవారం ఉపసంహరిం చుకున్నారు. ఈసారి ఎన్నికల్లో 2100 మంది ఎ న్నికల్లో తలపడుతున్నారు. సుమారుగా 750 మం ది ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు స్వత్ంర తులు ఉపసంహరించుకున్నట్లు ఎన్నికల కార్యాల యం పేర్కొంది. రెబల్స్‌కు ఆయా పార్టీ ముఖ్య నేతలు స్పష్టమైన హామీ ఇవ్వడంతో మెత్తపడ్డారు. సూర్యాపేటలో కాంగ్రెస్ పార్టీకి చెందిన పటేల్ రమేష్‌రెడ్డి, ఇబ్రహీంపట్నంలో దండెం రామిరె డ్డి, జుక్కల్‌లో గంగారం, బాన్సువాడలో బాలరా జు, డోర్నకల్లో నెహ్రూ నాయక్, వరంగల్ వెస్ట్‌లో జంగా రాఘవరెడ్డి,

చేవెళ్లలో సున్నం వసంత, మ హబూబాబాద్‌లో భూక్యా మంగీలాల్, ముథోల్ లో విజయ్‌కుమార్‌రెడ్డి, వైరా రామ్మూర్తి నాయక్, నకిరేకల్ దైదా రవీందర్ నామినేషన్లను వెనక్కి తీ సుకున్నారు. దీంతో కాంగ్రెస్ పార్టీకి రెబెల్స్ బెడద తప్పింది. అదే విధంగా బహుజన్ సమాజ్ పార్టీకి చెందిన మునుగోడు అభ్యర్ధి అందోజు శంకరచా రి, అదిలాబాద్‌కు చెందిన ఉయిక ఇందిరా బరి నుంచి తప్పించుకుని గులాబీ పార్టీ అభ్యర్థులకు మద్దతు పలికారు. కెసిఆర్ పోటీ చేస్తున్న గజ్వేల్ నియోజకవర్గంలో రికార్డు స్దాయిలో నామి నేషన్లు 127 దాఖలు చేశారు. ఈనెల 13న చేసిన పరిశీలనలో 13 నామినేషన్లు తిరస్కరణ కాగా 70 మంది నామినేషన్లు విత్ డ్రా చేసుకోవడంతో ప్ర స్తుతం 44 మంది పోటీ ఉన్నారు. కామారెడ్డిలో 19 మంది ఉపసంహరించుకోవడంతో 39మంది బరిలో నిలిచారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News