Saturday, November 23, 2024

పంజాబ్‌లో పశువులపై లంపీ పంజా

- Advertisement -
- Advertisement -

2100 cattle died due to lumpy skin disease in Punjab

వేలాది మరణం . వైరస్ సోకి విలవిల

చండీగఢ్ : పంజాబ్‌లో లంపీ చర్మవ్యాధితో 2100కు పైగా పశువులు మృతి చెందాయి. 60వేలకు పైగా గొడ్డూగాదెం ఇప్పుడు ఈ చర్మవ్యాధికి గురయ్యాయి. వీటి పరిస్థితి రోజురోజుకూ క్షీణిస్తోందని అధికారులు తెలిపారు. మూగజీవాలకు ఎక్కువగా చర్మం పాలిపోవడం, తరువాత ఇవి కోలుకోలేకపోవడం జరుగుతోంది. ఇది ఓ రకం వైరస్ వల్ల వ్యాపిస్తోందని నిర్థారణ అయింది. పశువుల మందలు ఎక్కువగా ఉండే ప్రాంతాలలోనే ఈ లంపీ చర్మ వ్యాధి ప్రబలుతోంది. ఈ వ్యాధిని నియంత్రించేందుకు పంజాబ్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. దాదాపు రెండు లక్షల పశువులకు ఇప్పటికే గోట్ పాక్స్ వ్యాక్సిన్‌ను వేశారు. ఈ చర్మ వ్యాధితో క్రమేపీ పశుజాతికి ప్రత్యేకించి వ్యవసాయదారులకు అత్యంత అవసరం అయిన పశువులకు పెను ముప్పు వాటిల్లుతున్నందున వెంటనే సిఎం భగవంత్ మాన్ స్పందించారు.

మంత్రులతో కూడిన త్రిసభ్య పర్యవేక్షక కమిటీని ఏర్పాటు చేశారు. రక్తం పీల్చే జలగల వంటి కీటకాల నుంచి ఈ లంపీ స్కిన్ వ్యాధి ఎక్కువగా ఆవులు, ఎద్దులు వంటివాటికి సంక్రమిస్తోంది. ముందుగా చర్మం ఉబ్బి తరువాత కణతలు ఏర్పడటం జ్వరం , క్రమేపీ ఇవి నీరు గడ్డి తీసుకోలేకపోవడం, పాల దిగుబడి తగ్గడం వంటి పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. వ్యవసాయ ఆధార సంబంధిత పంజాబ్‌లో ఇప్పుడు పశు వైరస్‌పై కలకలం రేకెత్తింది. గుజరాత్ ఇతర రాష్ట్రాలకు కూడా ఈ లంపీ వైరస్ వ్యాపిస్తోందని స్పష్టం అయింది. ఆఫ్రికా దేశాల కీటకాల ద్వారా ఈ వైరస్ ఇండియాకు వ్యాపించింది. పశు సంతతికి ప్రాణాంతకం అవుతోందని వెల్లడైంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News