Wednesday, January 8, 2025

కర్రు కాల్చి వాత పెట్టండి

- Advertisement -
- Advertisement -

రాష్ట్రంలో పదేళ్లు అధికారంలో ఉన్న బిఆర్‌ఎస్, కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి పార్టీలు మా ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నాయి. ప్రభుత్వాన్ని బద్నాం చేసేవారికి కర్రు కాల్చి వాత పెట్టాలి. 10 ఏళ్ల పాటు అధికారంలో ఉండి జయ జయహే పాటను జాతికి అంకితం చేయలేదు. తెలంగాణ తల్లి విగ్రహాన్ని సెక్రటేరియట్‌లో పెట్టే ఆలోచన కూడా గత పాలకులకు రాలేదు. నల్లచట్టాలు తెచ్చిన మోడీ, వరి వేస్తే ఉరి అన్న కెసిఆర్ ఇప్పుడు రైతుల గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉంది. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను గత పాలకులు నెరవేర్చలేదు. ప్రజా ప్రభుత్వాన్ని కాపాడుకునే బాధ్యత తెలంగాణ ప్రజలదే.

 మమ్మల్ని అధికారంలోకి తెచ్చిన మీరే
ఈ ప్రభుత్వాన్ని కాపాడుకోవాలి
విద్య, వైద్యం కాంగ్రెస్ ప్రభుత్వం
ప్రాధాన్యత అంశాలు ఏడాదిలోనే
14 వేల మందిని వైద్యారోగ్య
శాఖలో నియమించడం ఓ చరిత్ర
బిఆర్‌ఎస్ ప్రభుత్వం 8 వైద్య
కళాశాలలు ఇచ్చినా.. మౌలిక
వసతులు కల్పించలేదు ప్రక్షాళన
చేసిన పబ్లిక్ సర్వీస్ కమిషన్ మా
పనితీరుకు ఒక గీటురాయి
పిఎస్‌సిని రాజకీయ పునరావాస
కేంద్రంగా ఉపయోగించడం లేదు
త్వరలో గ్రూప్1 నియామక
పత్రాలు అందజేస్తాం నల్ల
చట్టాలు తెచ్చిన మోడీ, వరి వేస్తే
ఉరి అన్న కెసిఆర్ ఇప్పుడు రైతుల
గురించి మాట్లాడడం విడ్డూరంగా
ఉంది ఆరోగ్య ఉత్సవాలను
ప్రారంభించిన అనంతరం
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి
పలువురు అభ్యర్థులకు నియామక
పత్రాలు అందజేసిన సిఎం

మన తెలంగాణ/హైదరాబాద్ : కాంగ్రెస్ ప్రభుత్వంపై జరుగుతోన్న అసత్య ప్రచారాన్ని ప్రజలు, యువత తిప్పికొట్టాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చా రు. మీరు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మీదే అని ప్రజలను ఉద్దేశిస్తూ వ్యాఖ్యానించారు. ఈ ప్రభుత్వం కష్టం మీద వచ్చిందని చెప్పడం లేదని, కానీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయించడం ద్వారా మా తలరాతను మార్చి పెద్ద బా ధ్యతలు ఇచ్చారని, కాబట్టి విషప్రచారాన్ని కూడా తిప్పికొట్టే బాధ్యత మీదే అని యువతను ఉద్దేశిస్తూ పేర్కొన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి పది నెలలే అవుతోందని, ఈ పది నెలల్లోనే అద్భుతాలు జరుగుతాయా..? అని అడిగారు. అయినా ఏడాది కాలంలోనే ఎన్నో కార్యక్రమాలు చేశామన్నారు. ప్రజాపాలనకు ఏడా ది పూర్తయిందని.. తమ ప్రభుత్వంలో విద్య, వైద్య రంగాలకు అధిక ప్రాధాన్యం ఇ చ్చామని వ్యాఖ్యానించారు. ఆరోగ్య ఉత్సవాలకు సిఎం రేవంత్‌రెడ్డి శ్రీకారం చు ట్టారు. రాష్ట్ర వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఎన్‌టిఆర్ మార్గ్‌లో ని హెచ్‌ఎండిఎ గ్రౌండ్స్‌లో ఆరోగ్య ఉత్సవాలను

సోమవారం సిఎం రేవంత్‌రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా 213 నూతన అంబులెన్సులను వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహతో కలిసి సిఎం ప్రారంభించారు. ఇందులో 108 కోసం 136, 102 కోసం 77 అంబులెన్స్‌లు ఉన్నాయి. అనంతరం ఇటీవల 442 మంది సివిల్ అసిస్టెంట్ సర్జన్లు, 24 మంది ఫుడ్ ఇన్‌స్పెక్టర్లకు నియామకం కాగా, వారిలో కొంతమందికి డిప్యుటీ సీఎం భట్టి విక్రమార్క, వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహతో కలిసి సిఎం రేవంత్‌రెడ్డి నియామక పత్రాలు అందజేశారు. అలాగే 16 నర్సింగ్ కాలేజ్‌లను, 28 పారా మెడికల్ కాలేజ్‌లు , ట్రాన్స్‌జెండర్ల కోసం 32 మైత్రీ క్లినిక్‌లను సిఎం వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రవాణా శాఖ పొన్నం ప్రభాకర్, స్థానిక ఎంఎల్‌ఎ దానం నాగేందర్, వైద్యారోగ్య శాఖ అధికారులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సిఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ, యువత బలిదానాలతో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకున్నామని అన్నారు. లక్షలాదిమంది ఉద్యమబాట పట్టి తెలంగాణను సాధించుకున్నారని, కానీ గత పదేళ్లలో యువత ఆకాంక్షలు నెరవేరలేదని పేర్కొన్నారు. ప్రజా ప్రభుత్వం ఏర్పడిన ఏడాది కాలంలోనే వేలాదిగా ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు చేశామని తెలిపారు. వైద్యాఆరోగ్య శాఖలో 7,750 మందిని నియమించామని, మరో 6,496 ఖాళీల భర్తీ ప్రక్రియ కొనసాగుతోందని చెప్పారు. వైద్యారోగ్యశాఖ బలోపేతమైతేనే ఆరోగ్య తెలంగాణ సాధ్యమవుందని అన్నారు. గత బిఆర్‌ఎస్ ప్రభుత్వం 8 మెడికల్ కాలేజ్‌లకు జీఓలు ఇచ్చినా.. కనీస మౌలిక సదుపాయాల కల్పనలో చిత్తశుద్ధి చూపించలేదని ధ్వజమెత్తారు. కానీ ప్రస్తుత వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహా పట్టుదలతో కేంద్రంతో సంప్రదింపులు జరిపి, అధికారులతో సమన్వయం చేసుకుంటూ ఎనిమిది మెడికల్ కాలేజీలను అందుబాటులోకి తీసుకువచ్చారని చెప్పారు.దేశంలోనే అత్యధిక డాక్టర్లను అందించే రాష్ట్రంగా తెలంగాణ ఉందని అన్నారు. దామోదర రాజనరసింహా వృత్తి రీత్యా ఇంజనీర్ అయినా, వైద్యుడిగా పనిచేస్తూ వైద్యారోగ్య శాఖను ప్రక్షాళన చేస్తున్నారని కొనియాడారు.

50 వేలకు పైగా ఉద్యోగ నియామకాలు చేపట్టాం…
ఉద్యోగాల కల్పనలో బిఆర్‌ఎస్ ప్రభుత్వం విఫలమైందని సిఎం రేవంత్‌రెడ్డి విమర్శించారు. యువత బలిదానాలతో రాష్ట్రాన్ని సాధించుకున్నామని, లక్షలాదిమంది ఉద్యమబాట పట్టి తెలంగాణను సాధించుకున్నారని వ్యాఖ్యానించారు. రాష్ట్రం వస్తే ఉద్యోగాలు వస్తాయని అనుకున్నారని, కానీ పదేళ్లపాటు నియామకాలు చేపట్టలేదని మండపడ్డారు. తాము అధికారంలోకి వచ్చిన ఏడాది వ్యవధిలోనే.. 50 వేలకు పైగా ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు చేపట్టామని చెప్పారు. దేశ చరిత్రలోనే ఎక్కడా లేనివిధంగా నియామకాలు చేపట్టామని వెల్లడించారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ను ప్రక్షాళన చేశామని, పారదర్శకంగా పరీక్షలు నిర్వహించి నియామకాలు చేపట్టామని అన్నారు. డిఎస్‌సి ద్వారా 55 రోజుల్లో 11 వేల మందికి ఉద్యోగాలు ఇచ్చామని తెలిపారు. గ్రూప్-1 పరీక్షపై కొందరు అనవసర రాద్ధాంతం చేశారని, పరీక్షలు ఎందుకు వాయిదా వేయలేదంటూ తనను తిట్టారని గుర్తు చేశారు. పరీక్షలు వాయిదా పడితే నిరుద్యోగుల సమయం వృథా అవుతుందని, దాంతో కొందరు నిరాశ నిస్పృతకు లోనయి ఆత్మహత్యలకు దారితీస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.

పరీక్షలు వాయిదా వేస్తూ పోతే.. యువత విలువైన యుక్త వయసు వృథా అవుతుందని చెప్పారు.యువత తమ భవిష్యత్తును 21 నుంచి 35 ఏళ్ల లోపు చేసే పనులే నిర్ణయిస్తాయని అందుకే ఉద్యోగార్థుల సమయం వృథా చేయద్దని భావించి ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించిన షెడ్యూల్ ప్రకారం పరీక్షలు నిర్వహించి ఉద్యోగాలు ఇచ్చామని, ఇదీ తమ చిత్తశుద్ధి అని వ్యాఖ్యానించారు. తమ మంత్రివర్గంలో ఎవరి కుటుంబ సభ్యుల పిల్లలు ప్రభుత్వ ఉద్యోగాలు పొందలేదని, తెలంగాణ సమాజమే తమ కుటుంబం అనుకొని తాము ఉద్యోగాలు భర్తీ చేశారని వ్యాఖ్యానించారు. పరీక్షలు వద్దంటూ ఓ పార్టీ కృత్రిమ ఉద్యమాన్ని నడిపించిందని సిఎం మండిపడ్డారు. గత పదేళ్ల పాటు నిరుద్యోగులకు గ్రూప్ -1 పరీక్షలు జరగలేదని పేర్కొన్నారు. 2011 తర్వాత 2024లో విజయవంతంగా గ్రూప్ 1 పరీక్షలు జరిగాయని చెప్పారు. గత ప్రభుత్వంలో గ్రూప్ 1 పరీక్షలు జరిగితే ప్రశ్నాపత్రాలు జిరాక్స్ సెంటర్లలో అమ్ముకున్నారని సిఎం రేవంత్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. త్వరలోనే గ్రూప్-1 ఉద్యోగాల నియామకపత్రాలు అందజేస్తామని అన్నారు. 563 మంది గ్రూప్- 1 అధికారులను తెలంగాణ నిర్మాణంలో భాగస్వాములను చేయబోతున్నామని వెల్లడించారు. చిన్న ఆరోపణ లేకుండా టిజిపిఎస్‌సి పని చేస్తోందని తెలిపారు.

టిజిపిఎస్‌సిని గతంలో రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చారు
కాంగ్రెస్ ప్రభుత్వం నోటిఫికేషన్ ఇస్తే.. పరీక్షలు షెడ్యూల్ ప్రకారం జరుగుతాయని యువత నమ్ముతోందని వ్యాఖ్యానించారు. గతంలో ఆర్‌ఎంపీ డాక్టర్‌ను, తహసీల్దార్‌ను టిజిపిఎస్‌సి సభ్యులుగా నియమించారని విమర్శించారు. టిజిపిఎస్‌సిని రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చారని మండిపడ్డారు. తాము రాగానే ఉన్నత విద్యావంతులు, నిపుణులతో టిజిపిఎస్‌సిని సమూలంగా ప్రక్షాళన చేశామని అన్నారు. చిన్న ఉద్యోగి పెద్ద పెద్ద ఉద్యోగులను నియమించలేరుగా..? అని ప్రశ్నించారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉద్యోగాల గురించి పూర్తి అవగాహన ఉన్న అధికారులే సక్రమంగా పరీక్షలు నిర్వహిస్తారని భావించి రాజకీయ ప్రమేయం లేకుండా ఉన్నత చదువులు చదువుకున్న వారికి,

ఉన్నత ఉద్యోగాలు చేసిన వారిని కమిషన్ సభ్యులుగా నియమించామని తెలిపారు. డిజిపిగా పనిచేసిన మహేందర్‌రెడ్డి సమర్థవంతంగా పరీక్షలు నిర్వహించారని, ఆయన పదవీ కాలం ముగుస్తుండటంతో పేద కుటుంబంలో జన్మించి కష్టపడి చదివి ఐఎఎస్ అధికారి అయిన బుర్రా వెంకటేశంను టిజిపిఎస్‌సి చైర్మన్‌గా నియమించామని తెలిపారు. తాము పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ను రాజకీయ పునరావాసంగా మార్చదల్చుకోదని స్పస్టం చేశారు. టిజిపిఎస్‌సి చైర్మన్‌గా గతంలో డిజిపి స్థాయి అధికారి ఉంటే.. ఇప్పుడు సీనియర్ ఐఏఎస్ అధికారి ఉన్నారని తెలిపారు.

యూనివర్సిటీల్లో ఖాళీల భర్తీ చేస్తాం
రాష్ట్రంలోని యూనివర్సిటీలకు వైస్ ఛాన్స్‌లర్లను సకాలంలో నియమించలేదని, కానీ తాము సమర్థులైన వారిని విసిలుగా నియమించామని ముఖ్యమంత్రి తెలిపారు. యూనివర్సిటీల్లో టీచింగ్, నాన్ టీచింగ్ ఖాళీలను భర్తీ చేయాలని ఆదేశించామని చెప్పారు. అగమ్యగోచరంగా మారిన విద్య, వైద్య శాఖలను గాడిలో పెడుతున్నామన్నారు. తమ ప్రభుత్వం తొలి ప్రాధాన్యత విద్య, వైద్యం అని, తాము అధికారంలోకి వచ్చాక ఈ రెండు శాఖలపై ప్రత్యేక దృష్టి సారించామని అన్నారు. గత ప్రభుత్వం జిల్లాకో మెడికల్ కళాశాల, నియోజకవర్గానికో 100 పడకల ఆస్పత్రి ఇస్తామన్నారని, కానీ ఇవ్వలేదని చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News