Thursday, September 19, 2024

రాష్ట్రంలో కొత్తగా 213 మందికి కరోనా

- Advertisement -
- Advertisement -
213 new coronavirus cases in Telangana
జిహెచ్‌ఎంసిలో 165, జిల్లాల్లో 48 మందికి నిర్ధారణ, కోవిడ్ దాడిలో నలుగురు మృతి, కొండాపూర్ ఏరియా ఆసుపత్రిలో 14 మందికి పాజిటివ్, గోకుల్ చాట్  ఓనర్‌కు సోకిన కోవిడ్, ఇప్పటి వరకు 75 మంది మీడియా ఉద్యోగులకు కరోనా

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా కరోనా కేసులు భారీగా నమోదవుతున్నా యి. కొత్తగా మరో 213 మందికి వై రస్ సోకగా, నలుగురు మృతి చెందార ని ఆరోగ్యశాఖ ప్రకటించింది. మంగళవారం వైరస్ సోకిన వాళ్లల్లో జిహెచ్‌ఎంసి పరిధిలో 165 మంది, జిల్లాల్లో 48 మంది ఉన్నట్లు వైద్యారోగ్యశాఖ తె లిపింది. దీంతో రాష్ట్రంలో కరోనా బా ధితులు సంఖ్య 5406కి చేరగా, వైరస్ దాడిలో చనిపోయిన వారి మొత్తం సంఖ్య 191కి పెరిగింది. అదే విధంగా వైరస్ భారిన పడి పూర్తిగా కోలుకొని ఆరోగ్యవంతులుగా ఇళ్లకు చేరిన వారి సంఖ్య 30,27కి పెరగగా, ప్రస్తుతం 2188 మంది హోం ఐసొలేషన్, ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నట్లు అధికారులు తెలిపారు.

అయితే మంగళవారం కొండాపూర్ ఏరియా ఆసుపత్రిలో 14 మందికి కోవిడ్ సోకడం కలకలం రేపింది. ఇటీవల ఆసుపత్రి సూపరింటెండెంట్‌కు పాజిటివ్ వచ్చిన విషయం తెలిసిందే. అయితే అతనిప్రైమరీ కాంటాక్ట్‌లకు పరీక్షలు నిర్వహించగా పది మంది వైద్యసిబ్బంది, మరో నలుగురు ఇతరులకు వైరస్ తేలినట్లు అధికారులు పేర్కొన్నారు. అదే విధంగా కోఠిలో ఫేమస్ అయిన గోకుల్ చాట్ ఓనర్‌కు కరోనా తేలింది. అయితే అతి పెద్ద వ్యాపార సముహాల మధ్య ఉన్న గోకుల్ చాట్‌లో వైరస్ రావడంతో ఆ పరిసర ప్రాంతాల్లో టెన్షన్ వాతావరణం కనిపించింది.

గత కొద్ది రోజులుగా గొంతునొప్పితో బాధపడుతున్న యజమాని విజయవార్గికి రెండు రోజుల క్రితం టెస్టులు చేయగా పాజిటివ్ తేలినట్లు అధికారులు స్పష్టం చేశారు. దీంతో ఆ షాపుని మూసేసి సిబ్బందిని మొత్తం క్వారంటైన్ చేసినట్లు అధికారులు తెలిపారు. దీంతో పాటు కొత్తగా మరో ఐదు మంది మీడియా ఉద్యోగులకు వైరస్ సొకగా, రాష్ట్రంలో కోవిడ్ బారిన పడ్డ మొత్తం మీడియా ఉద్యోగుల సంఖ్య 75కి పెరిగింది. దీంతో పాటు ఇప్పటి వరకు సుమారు 155 మంది పోలీస్ సిబ్బందికి వైరస్ తేలినట్లు అధికారులు పేర్కొన్నారు.

1251 శాంపిల్స్‌లో 213 పాజిటివ్

రాష్ట్ర వాప్తంగా మంగళవారం సేకరించిన 1251శాంపిల్స్‌లో 213 మందికి పాజిటివ్, 1038 మందికి నెగటివ్ వచ్చిందని అధికారులు ప్రకటించారు. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో నిర్వహించిన టెస్టుల సంఖ్య 44431కి పెరిగింది. మంగళవారం వైరస్ సోకిన వాళ్లల్లో 165 మంది జిహెచ్‌ఎంసి పరిధిలో ఉండగా, జనగాం నుంచి 1, కామారెడ్డి, మెదక్ 13, మేడ్చల్ 3, కరీంనగర్ 6, ఆసిఫాబాద్ 1, నిజామాబాద్ 2, పెద్దపల్లి 1, రంగారెడ్డి 16, సంగారెడ్డి 2, సిద్దిపేట్ 1, యాదాద్రి జిల్లాలో మరోకరు ఉన్నట్లు అధికారులు తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News