Wednesday, January 22, 2025

తొలివిడతలో 21,367 పాలిటెక్నిక్ డిప్లొమా సీట్ల కేటాయింపు

- Advertisement -
- Advertisement -
29 వరకు సెల్ఫ్ రిపోర్టింగ్‌కు అవకాశం

మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో తొలి విడతలో 21,367 (72.69 శాతం) పాలిటెక్నిక్ డిప్లొమా సీట్లు భర్తీ అయ్యాయి. పాలిసెట్ 2023 కౌన్సెలింగ్‌లో భాగంగా ఆదివారం ఇంజినీరింగ్, నాన్ ఇంజినీరింగ్, అగ్రికల్చర్ డిప్లొమా కోర్సుల్లో తొలి విడత సీట్లు కేటాయించారు. రాష్ట్ర వ్యాప్తంగా 116 కళాశాలల్లో 29,396 సీట్లు అందుబాటులో ఉండగా, తొలి విడతలో 21,367 సీట్లు భర్తీ అయ్యాయి. 56 ప్రభుత్వ కాలేజీల్లో 13,321 సీట్లకు గాను.. 11,648 సీట్లు కేటాయించగా, 1,673 సీట్లు ఖాళీగా మిగిలాయి. అలాగే 60 ప్రైవేటు విద్యా సంస్థల్లో 16,075 సీట్లకు గాను 9,719 సీట్లు భర్తీ కాగా, 6,356 సీట్లు భర్తీ కావాల్సి ఉంది. ఇడబ్లూఎస్ కోటాలో 580 సీట్లు కేటాయించారు. మొదటి విడత సీట్ల కేటాయింపు తర్వాత మొత్తం 8,029 పాలిటెక్నిక్ సీట్లు ఖాళీగా మిగిలాయి. సీట్లు పొందిన విద్యార్థులు ఈ నెల 29 వరకు సెల్ఫ్ రిపోర్ట్ చేయాలని సాంకేతిక విద్య కమిషనర్ వాకాటి కరుణ తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News