Saturday, December 21, 2024

తెలుగు విద్యార్థులకు స్వాగతం పలికిన మంత్రి మల్లారెడ్డి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ ః మణిపూర్ రాష్ట్రంలో చిక్కుకున్న తెలుగు రాష్ట్రాలకు చెందిన 214 మంది విద్యార్థులు ఇంపాల్ నుండి హైదరాబాద్‌కు చేరుకున్నారు. ఈ క్రమంలో మణిపూర్ నుండి ప్రత్యేక విమానంలో శంషాబాద్ విమానాశ్రయానికి వచ్చిన ఆ విద్యార్థులకు బొకే అందించి కార్మిక శాఖ మంత్రి మల్లా రెడ్డి స్వాగతం పలికారు. విద్యార్థులతో ముచ్చటించి వారికి బిస్కెట్ పాకెట్లను పంపిణీ చేశారు. దీంతో పాటు వారి లగేజీ బ్యాగులను తీసి వారికి స్వయంగా అందించారు.

వారి వారి గమ్యస్థానాలకు వెళ్ళటానికి ప్రభుత్వం ఏర్పాటు చేసిన బస్సులలో విద్యార్థులను కోర్చోబెట్టి వారితో కొద్ది దూరం కలిసి వెళ్లారు. తమను మణిపూర్ నుండి సురక్షితంగా రప్పించిన తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్‌కు వారు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రి మల్లా రెడ్డితో పాటు రాజేంద్రనగర్ ఎంఎల్‌ఏ ప్రకాశ్ గౌడ్, అడిషినల్ డిజీలు మహేశ్ భగవత్, అభిలాష బిస్త్, డిఐజి బి. సుమతి, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ హరీష్, ప్రోటోకాల్ డైరెక్టర్లు అర్విందర్ సింగ్ తదితర అధికారులు స్వాగతం పలికారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News