Friday, November 22, 2024

ఒమిక్రాన్ @ 215

- Advertisement -
- Advertisement -

215 Omicron cases in Telangana

కొత్తగా మహారాష్ట్రలో 11, తెలంగాణలో 4 కేసులు

వార్‌రూమ్‌లు యాక్టివేట్ చేయండి

అవసరమైతే రాత్రిపూట కర్ఫ్యూలు
జనసమూహాల నియంత్రణ
ప్రజారవాణాపై ఆంక్షలు
డెల్టా రకంతో పోలిస్తే ఒమిక్రాన్ 3రెట్లు అధికంగా వ్యాప్తి
రాష్ట్రాలను అప్రమత్తం చేస్తూ కేంద్ర ఆరోగ్యశాఖ లేఖలు
కర్నాటకలో నూతన సంవత్సర వేడుకలపై ఆంక్షలు
అమెరికాలో ఒమిక్రాన్ విజృంభణ
వారం రోజుల్లో 6.50లక్షల కేసులు,టెక్సాస్‌లో తొలిమరణం

న్యూఢిల్లీ : ఒమిక్రాన్ కలవరంపై రాష్ట్రాలను కేంద్ర ప్రభుత్వం అప్రమత్తం చేసింది. డెల్టా రకంతో పోలిస్తే ఒమిక్రాన్ మూడు రెట్లు అధికంగా వ్యాప్తి చెందుతున్నందున మరింత లోతుగా ఆ డేటాను విశ్లేషించి, డైనమిక్‌గా నిర్ణయాలు తీసుకోవాలని రాష్ట్రాలకు సూచించింది. ఈమేరకు కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ మంగళవారం సాయంత్రం రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల అధికార యంత్రాంగాలకు లేఖలు రాశారు. ఒమిక్రాన్ కట్టడికి తక్షణమే వార్‌రూమ్‌లను యాక్టివేట్ చేయాలన్నారు. దేశం లోని అనేక ప్రాంతాల్లో డెల్టా రకం కేసులు ఇంకా నమోదవుతున్నాయని, ఈ నేపథ్యంలో ఒమిక్రాన్ వ్యాప్తికి చెక్ పెట్టేందుకు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతా లు, జిల్లాల వారీగా ఎక్కడికక్కడ కఠిన చర్యలు చేపట్టాలని సూచించారు. అవసరాన్ని బట్టి రాత్రిపూట కర్ఫూలు విధించాలని, భారీ జనసమూహాలను నియంత్రించాలని, కార్యాలయాల్లో సిబ్బంది సంఖ్యను తగ్గించాలని, ప్రజా రవాణా పై ఆంక్షలు వంటి చర్యలను చేపట్టాలని లేఖలో వివరించారు. ఆస్పత్రుల్లో పడకలు, అంబులెన్సులు, ఆక్సిజన్ పరికరాలు, ఔషధాలు వంటి వైద్య సౌకర్యాల మెరుగుకు అత్యవసర నిధులు వినియోగించుకోవాలని సూచించారు.

100 శాతం వ్యాక్సినేషన్ కవరేజిని వేగవంతం చేయాలన్నారు. తాజాగా మహారాష్ట్రలో 11, తెలంగాణలో 4 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు దేశ వ్యాప్తంగా ఒమిక్రాన్ కేసుల సంఖ్య 215 కి పెరిగింది. మహారాష్ట్రలోని తాజా 11 కేసుల్లో ముంబైలో 8, నవీముంబై, పింప్రీ చించ్వాడ్, ఉ స్మానాబాద్‌లలో ఒక్కొక్కటి వంతున కేసులు బయటపడ్డాయి. ఇప్పటివరకు 12 రాష్ట్రాలకు ఒమిక్రాన్ విస్తరించింది. అధిక కేసులు మహారాష్ట్ర (65), ఢిల్లీ (54), తెలంగాణ (24)లో ఉన్నాయి. కర్ణాటకలో 19, రాజస్థాన్‌లో 18, కేరళలో 15, గుజరాత్‌లో 14 కేసులు వెలుగు చూశాయి. ఈ వేరియంట్ బా ధితుల్లో 77 మంది కోలుకున్నారని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.

పలు పట్టణాల్లో రాత్రి కర్ఫ్యూ

క్రిస్టమస్, నూతన సంవత్సర వేడుకల సందర్భంగా జనం గుంపులుగా చేరకుండా కర్నాటక ప్రభుత్వం ఆంక్షలు విధించింది. డిసెంబర్ 22నుంచి జనవరి 2 వరకు 144 సెక్షన్ కింద ఆంక్షల్ని అమలు చే యనున్నట్టు తెలిపింది. బెంగళూర్‌తోపాటు ఒమి క్రాన్ ప్రభావం ఉన్న పట్టణాల్లో డిసెంబర్ 30 నుం చి జనవరి 2వరకు రాత్రి కర్ఫూ విధిస్తున్నట్టు తె లిపింది. అయితే, రెస్టారెంట్లు, క్లబ్బుల్లో 50 శాతం సామర్థంతో నూతన సంవత్సర వేడుకలు జరుపు కునేందుకు అనుమతి ఇచ్చింది. డిజెలాంటి ప్రత్యేక కార్యక్రమాలపై నిషేధం విధించింది. వేడుకల్లో పా ల్గొనేవారంతా వ్యాక్సిన్ పొందినవారై ఉండాలని షరతు విధించింది. సాంకేతిక సలహా కమిటీ (టిఎసి) సూచనమేరకు ఈ ఆంక్షలు విధిస్తున్నట్టు ముఖ్యమంత్రి బసవరాజ్‌బొమ్మై తెలిపారు. ఒమ కాన్ వేగంగా వ్యాప్తి చెందుతున్న నేప థ్యంలో రో డ్లు, బహిరంగ ప్రదేశాల్లో పార్టీలు జరు పుకునేందు కు అనుమతించొద్దని టిఎసి సిఫారసు చేసింది.

టెక్సాస్‌లో మొదటి మరణం

అమెరికాలో నమోదవుతున్న కొవిడ్19 కేసుల్లో ఒమిక్రాన్ కేసులు ప్రథమ స్థానానికి చేరుకున్నాయ ని ఆ దేశ ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. గత వారంలో నమోదైన కేసుల్లో 73 శాతం ఈ వేరి యంట్‌వేనని అమెరికా అంటువ్యాధుల నియం త్రణ కేంద్రం(సిడిసి) డైరెక్టర్ రోచెల్లే వాలెన్‌స్కీ తెలిపారు. వారం రోజుల్లో 6,50,000 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయని తెలిపారు. గతవారంతో పోలిస్తే ఈ వేరియంట్ కేసులు ఆరు రెట్లు పెరిగా యని ఆమె పేర్కొన్నారు. తాజాగా న్యూయార్క్, ఆ గ్నేయ, పారిశ్రామిక మధ్య పశ్చిమ, వాయువ్య పసిఫిక్ ప్రాంతాల్లో నమోదవుతున్న కేసుల్లో 90 శాతంపైగా ఒమిక్రాన్ కేసులేనన్నారు. సోమవారం టెక్సాస్ రాష్ట్రంలోని హారిస్ కౌంటీలో ఒమిక్రాన్ సో కిన వ్యక్తి చనిపోయారని స్థానిక ఆరోగ్యశాఖ అధి కారులు వెల్లడించారు. ఈ వేరియంట్ వల్ల అమె రికాలో సంభవించిన మొదటి మరణమిది.

వేడుకలకు రాణీ ఎలిజబెత్2 దూరం

యుకెలో ఒమిక్రాన్ ఉథృతి నేపథ్యంలో బ్రిటన్ రా ణి ఎలిజబెత్2క్రిస్మస్ వేడుకలకు దూరంగా ఉం డాలని నిర్ణయించుకున్నారు. రాజకుటుంబం ఏ టా క్రిస్మస్ వేడుకల్ని తూర్పు ఇంగ్లాండ్‌లోని సాం ద్రింఘమ్ ఎస్టేట్‌లో జరుపుకోవడం ఆనవాయితీ.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News