- Advertisement -
లక్షన్నరకు చేరువైన బాధితులు
న్యూఢిల్లీ : దేశంలో తాజాగా 24 గంటల వ్యవధిలో 21 వేలకు పైగా కేసులు రాగా, పాజిటివిటీ రేటు 4.25 శాతంగా ఉంది. ఇక యాక్టివ్ కేసుల సంఖ్య లక్షన్నరకు చేరువవడం ఆందోళన కలిగిస్తోంది. అయితే రికవరీలు కూడా పెరుగుతుండటం సానుకూలాంశం. గత 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 5,07,360 పరీక్షలు చేయగా, కొత్తగా 21,566 కేసులు నమోదయ్యాయి. రోజువారీ పాజిటివిటీ రేటు 4.25 శాతంగా ఉంది. గత 24 గంటల్లో 18,294 మంది కోలుకోగా, మొత్తం రికవరీలు 4.31 కోట్లుగా ఉంది. రికవరీ రేటు 98.46 శాతం. ప్రస్తుతం 1,48,881 వరకు యాక్టివ్ కేసులు ఉండగా, క్రియాశీల కేసుల రేటు 0.34 శాతంగా ఉంది. 24 గంటల్లో 45 మంది మృతి చెందగా, మొత్తం మరణాలు 5.25 లక్షలు. అలాగే 24 గంటల్లో 29.12 లక్షల డోసులు పంపిణీ కాగా, ఇప్పటివరకు మొత్తం 200.91 కోట్ల డోసులు పంపిణీ అయ్యాయి.
- Advertisement -