జిహెచ్‌ఎంసిలో 361, జిల్లాల్లో 1796 మందికి పాజిటివ్
3,34,738 కు చేరిన కరోనా బాధితుల సంఖ్య
సినీ నిర్మాత బండ్ల గణేష్‌కు రెండోసారి కరోనా
హైదరాబాద్: రాష్ట్రంలో కొత్తగా మరో 2157 కేసులు నమోదయ్యాయి. వీటిలో జిహెచ్‌ఎంసి పరిధిలో 361 మంది ఉండగా ఆదిలాబాద్‌లో 65, భద్రాద్రి 24,జగిత్యాల 107, జనగామ 12, భూపాలపల్లి 11,గద్వాల 13, కామారెడ్డి 57,కరీంనగర్ 74,ఖమ్మం 59, ఆసిఫాబాద్ 13,మహబూబ్‌నగర్ 68, మహబూబాబాద్ 8, మంచిర్యాల 51, మెదక్ 28, మేడ్చల్ మల్కాజ్‌గిరి 245, ములుగు 4, నాగర్‌కర్నూల్ 27, నల్గొండ 68,నారాయణపేట్ 11, నిజామాబాద్ 187, పెద్దపల్లి 21,సిరిసిల్లా 31, రంగారెడ్డి 206, సంగారెడ్డి 135, సిద్ధిపేట్ 59, సూర్యాపేట్ 29, వికారాబాద్ 35,వనపర్తి 21, వరంగల్ రూరల్ 14, వరంగల్ అర్బన్ లో 64, యాదాద్రిలో మరో 18 మంది ఉన్నట్లు అధికారులు తెలిపారు. అదే విధంగా వైరస్ దాడిలో మరో 8 మంది చనిపోయినట్లు అధికారులు పేర్కొన్నారు. దీంతో రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 3,34,738కి చేరగా, డిశ్చార్జ్‌ల సంఖ్య 3,07,499కి చేరింది. అదే విధంగా వైరస్ దాడిలో ఇప్పటి వరకు చనిపోయిన వారి సంఖ్య 1780 పెరిగిందని వైద్యారోగ్యశాఖ డైరెక్టర్ డా శ్రీనివాసరావు ప్రకటించారు.
కోటి 12 లక్షలు దాటిన కరోనా టెస్టులు…
రాష్ట్రంలో కరోనా టెస్టుల సంఖ్య కోటి 12 లక్షల 53 వేల 374కు చేరాయి. అంటే ప్రతి పది లక్షల్లో 3,02,347 మందికి టెస్టులు చేసినట్లు ఆరోగ్యశాఖ గణాంకాలను విడుదల చేసింది. రాబోయే రోజుల్లో వీటి సంఖ్యను మరింత పెంచుతామని అధికారులు తెలిపారు. ఇదిలా ఉండగా ప్రస్తుతం రాష్ట్రంలో 25,459 యాక్టివ్ కేసులుండగా ఏకంగా 16,892 మంది ఐసోలేషన్ సెంటర్లలో చికిత్స పొందుతున్నారు.
సినీ నిర్మాత బండ్ల గణేష్‌కు రెండోసారి కరోనా….
సినీ నిర్మాత బండ్ల గణేష్‌కు రెండోసారి కరోనా సోకింది. ఇటీవల జరిగిన వకీల్ సాబ్ సినిమా ప్రి రిలీజ్ పంక్షన్‌లో ఆయన పాల్గొన్న అనంతరం స్వల్ప లక్షణాలు తేలడంతో టెస్టు చేపించుకోగా పాజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో ప్రస్తుతం ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ట్రీట్మెంట్ పొందుతున్నట్లు ఆయన సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. మరోవైపు ఇదే ఫంక్షన్‌లో పాల్గొన్న పవన్ కల్యాణ్ వ్యక్తిగత సిబ్బందికి కూడా కొవిడ్ తేలింది. దీంతో పవర్ స్టార్ కూడా క్వారంటైన్‌లోకి వెళ్లిన విషయం విధితమే. ఇదిలా ఉండగా గతంలోనూ ఓ సారి బండ్ల గణేష్ కొవిడ్ నుంచి కోలుకున్న విషయం తెలిసిందే.