న్యూఢిల్లీ: దేశంలో శుక్రవారం ఒక్కరోజే 21,880 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య 4,38,47,065కి పెరిగింది. దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 1,49,482కి చేరుకున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ శుక్రవారం తెలిపింది. గురువారం నుంచి శుక్రవారం ఉదయం 8 గంటల వరకు దేశంలో మరో 60 మంది కరోనా వైరస్ కారణంగా మృత్యువాత పడ్డారు. దీంతో కరోనా వైరస్ కారణంగా మరణించిన వారి సంఖ్య 5,25,930కి చేరుకుంది. దేశంలో కరోనా రికవరీ రేటు 98.46 శాతం ఉండగా మొత్తం నమోదైన కేసులలో యాక్టివ్ కేసులు 0.34 శాతమని ఆరోగ్య శాఖ తెలిపింది. గడచిన 24 గంటలలో యాక్టివ్ కేసులు 601 పెరిగాయి. రోజువారీ పాజిటివిటీ రేటు 4.42 శాతం ఉన్నట్లు తెలిపింది. దేశంలో ఇప్పటివరకు మొత్తం 4,31,71,653 మంది కొవిడ్ నుంచి కోలుకున్నారు. మరణాల రేటు 1.20 శాతమని ఆరోగ్య శాఖ పేర్కొంది. జాతీయ వ్యాక్సినేషన్ ప్రక్రియ కింద ఇప్పటివరకు దేశంలో 201.30 కోట్ల డోసుల కొవిడ్ వ్యాక్సిన్ పంపిణీ జరిగినట్లు మంత్రిత్వశాఖ తెలిపింది.
దేశంలో కొత్తగా 21,880 కరోనా కేసులు
- Advertisement -
- Advertisement -
- Advertisement -