Wednesday, January 22, 2025

ఇజ్రాయెల్‌పై హమాస్ దాడిలో 22 మంది అమెరికన్ల మృతి

- Advertisement -
- Advertisement -

వాషింగ్టన్ : ఇజ్రాయెల్‌పై హమాస్ దాడిలో 22 మంది అమెరికన్లు మృతి చెందారు. 17 మంది గల్లంతయ్యారని శ్వేతభవనం ప్రకటించింది. అయితే ఈ సంఖ్య మరింత పెరుగుతుందని పేర్కొంది. హమాస్ బందీలుగా చేసిన వారిలో అమెరికన్లు చాలా మంది ఉండొచ్చని, అయితే వారిని విడిపించడానికి ఇజ్రాయెల్‌తో అమెరికా చర్చలు జరుపుతోందని అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జేక్ సులివాన్ చెప్పారు. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్‌కు మరింత రక్షణ సహాయాన్ని అమెరికా అందించింది. ఐరన్‌డోమ్ ఇంటెర్‌సెప్టెర్ క్షిపణులను అందించింది. త్వరలో మరికొన్నిటిని అందిస్తామని ప్రకటించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News