Friday, December 20, 2024

రష్యా హెలికాప్టర్ ప్రమాదం.. 22 మృతదేహాలు స్వాధీనం

- Advertisement -
- Advertisement -

రష్యా తూర్పు ప్రాంతం లోని కమ్‌చత్కా ద్వీపకల్పం లోని వచ్కజెట్స్ అగ్నిపర్వతం సమీపాన శనివారం కుప్ప కూలిన హెలికాప్టర్ ప్రమాదంలో ప్రయాణిస్తున్న మొత్తం 22 మంది చనిపోయారు. వారి మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్టు రష్యా ఎమర్జెన్సీ మంత్రిత్వశాఖ వెల్లడించింది. మృతుల్లో 19 మంది ప్రయాణికులు ఉండగా, ముగ్గురు సిబ్బంది ఉన్నారు. ప్రతికూల వాతావరణంలో దృశ్యలోపం వల్ల ఈ ప్రమాదం సంభవించిందని రష్యా అధికార వార్తా సంస్థ వెల్లడించింది. ఈ ప్రమాదం పైలట్ ఆపరేషన్‌లో పొరపాటు వల్ల జరిగిందా లేదా సాంకేతిక సమస్య వల్ల జరిగిందా అన్న కోణంలో దర్యాప్తు ప్రారంభించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News