Sunday, December 22, 2024

మళ్లీ ముంచెత్తిన వాన

- Advertisement -
- Advertisement -

మహబూబాబాద్ జిల్లాలో 22 సెం.మీ. వర్షపాతం
షీయర్ జోన్ ప్రభావంతో 26వరకు రాష్ట్రంలో భారీ,
ఐదు జిల్లాల్లో అతి భారీ వర్షాలు సూర్యాపేట
జిల్లాలో పాలేరు వాగు పొంగి వ్యవసాయ క్షేత్రంలో
చిక్కుకున్న 23మంది కూలీలు, సాయం కోసం
నిరీక్షణ హన్మకొండ-ఏటూరునాగారం మధ్య
వాగులు పొంగి నిలిచిపోయిన రాకపోకలు గరిష్ట
స్థాయి చేరువలో శ్రీశైలం నేడు గేట్ల ఎత్తివేత 3 దశాబ్దాలుగా పెరుగుతున్న వర్షపాతం
ఈ ఏడాది వెయ్యి శాతం అధికం

మన తెలంగాణ/న్యూస్ నెట్‌వర్క్ : వరుణుడి రూపంలో మరోసారి తెలంగా ణకు గండం పొంచి ఉన్నట్టు కన్పిస్తోం ది. శుక్రవారం రోజంతా కురిసిన వర్షా లతో అటు ఉత్తర తెలంగాణ, ఇటు దక్షి ణ తెలంగాణలోని పలు జిల్లాలు తడిసి ముద్దయ్యా యి. భాగ్యనగరం మాటైతే చెప్పక్కర్లేదు. ఏ ప్రాంతం నిం డుకుండలా మారిపోయింది. పది రోజు ల క్రితం వర్షాలతో ఉక్కిరిబిక్కిరి అయి న రాష్ట్రం మరోసారి వరుణ ప్రతాపం తో ఇబ్బందులు పడేలా కన్పిస్తోంది. ఏ సమయంలో ఎటువంటి ఉపద్రవం కన్పిస్తోంది. ఏ సమయంలో ఎటువంటి ఉపద్రవం వచ్చి పడుతుందోనని జనం బెంబేలెత్తిపోతున్నారు. సూర్యపేట జిల్లా మద్దిరాల మండలం జి కొత్తపల్లి సమీపంలోని పాలేరువాగు ఉధృతంగా ప్రవహించడంతో వ్యవసాయ పనుల కోసం వెళ్లిన 23మంది రైతులు, కూలీలు వాగు మధ్యలో చిక్కుకుపోయారు. మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలంలోని కొత్త చెరువు మత్తడి దుంకడంతో తొర్రూరు రోడ్డులో వాగు ఉప్పొంగడంతో ఉదయం పాఠశాలకు వెళుతున్న ఆర్యభట్ట పాఠశాల బస్సు వరద నీటిలో చిక్కుకుంది. స్థానికులు గమనించడంతో చిన్నారులను క్షేమంగా బైటపడ్డారు.

అదేవిధంగా ఏటూరు నాగారం వద్ద వరద నీటితో రోడ్లపైనుంచే వరద నీరు ఉప్పొంగి ప్రవహిస్తుంది. రోజంతా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుండడంతో పలు జిల్లాల్లో ఇప్పటికే వాగులు, వంకలు ఉప్పొంగుతున్నాయి. చెరువులు, కుంటలు నిండి మత్తళ్లు దుంకడంతో భారీగా వరదలు వచ్చే అవకాశం ఉందని జనం ఆందోళన చెందుతున్నారు. మొన్న వచ్చిన వర్షాలతో ఇప్పటికే నదులు ఉప్పొంగి ఊళ్ల మీదకు వరదల రూపంలో వచ్చి చెరువులు, కుంటలు పొంగి ప్రవహించగా.. దాన్నుంచి ఇంకా కోలుకోకుండగనే తిరిగి ఇంత దట్టంగా వర్షాలు కురుస్తుండటంతో జనం అల్లాడిపోతున్నారు. ఉదయం నుంచి కురుస్తున్న భారీ వర్షాలతో ఉమ్మడి వరంగల్, రంగారెడ్డి, హైదరాబాద్, ఖమ్మం, నల్లగొండ, కరీంనగర్ జిల్లాలు ముద్దాయ్యాయి. వర్షాల మూలంగా ఏ క్షణంలో ఎటువంటి ఉపద్రవం ముంచుకువస్తుందో.. ఎటువంటి ప్రమాదాన్ని ఎదుర్కొవాల్సి వస్తుందోనని ఆందోళన చెందుతున్నారు. పల్లపు ప్రాంతాల ప్రజలైతే బిక్కుబిక్కుమంటూ జీవనం గుడుపుతున్నారు.

మరో మూడు రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయంటూ వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో అయా జిల్లాల్లోని అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. వరంగల్ ఉమ్మడి జిల్లాలోని వరంగల్, హన్మకొండ, మహబూబాబాద్, ములుగు, భూపాలపల్లి, జనగాం జిల్లాల్లో వర్షం తీవ్రత ఎక్కువగానే ఉంది. మొన్న వచ్చిన వర్షాలతో ఇప్పటికే పాకాల లక్నవరం సరస్సులు ఉప్పొంగుతుండగా మళ్లీ వరదల తాకిడితో ఆసరస్సులు నిరంతరం మత్తడి దుంకుతున్నది. మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలంలోని కొమ్మలవంచ కొత్త చెరువు మత్తడి దుంకడం వల్ల తొర్రూరు రహదారిలోని వాగు ఉప్పొంగింది. దీంతో శుక్రవారం ఉదయం పాఠశాలకు వెళుతున్న ఆర్యభట్ట పాఠశాలకు చెందిన బస్సు వాగులో ఇరుక్కుపోయింది. అప్రమత్తమైన బస్సు డ్రైవర్, స్థానికులు వరద ఉధృతి పెరుగకముందే బస్సులోని విద్యార్థులను ఒడ్డుకుచేర్చి జెసిబి సాయంతో బస్సును బయటకు తీశారు.

వికారాబాద్‌పరిగితాండూర్ మధ్య నిలిచిన రాకపోకలు

వికారాబాద్ జిల్లావ్యాప్తంగా వర్షాల ప్రభావం ముమ్మరంగా ఉంది. సాయంత్రం నుంచి భారీగా వర్షం కురవడంతో వికారాబాద్‌లోని రోడ్లన్నీ జలమయంగా మారాయి. గిరిగిట్ పల్లి రోడ్డు మార్గంలో రైల్వే బ్రిడ్జి కింద ప్రమాదకరంగా వరద నీరు పారుతుండడంతో వికారాబాద్ పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. వికారాబాద్ పరిగి రోడ్డు మార్గంలోని మద్గుల్ చిట్టెంపల్లి వాగు ప్రమాదకరంగా ప్రవహిస్తుంది. రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ధారూర్ మండలం బాచారం వాగుపై తాత్కాలిక రోడ్డుపై నుంచి భారీగా నీరు పారుతోంది. దీంతో వికారాబాద్ తాండూర్ రోడ్డు మార్గంలో రాకపోకలు పూర్తిగా బంద్ అయ్యాయి. సుమారు రెండు గంటలపాటు ఎడతెరిపిలేకుండా కురిసిన వర్షానికి ఖమ్మం జిల్లా బోనకల్‌తోపాటు అనేక చుట్టుపక్కల గ్రామాలలో వాగులు, వంకలు పొంగిపొర్లాయి. గత వారం నుండి తుఫాను ప్రభావంతో భారీ వర్షాల తర్వాత తెరిపివ్వడంతో నాలుగు రోజులుగా ఇచ్చిన తెరిపితో వ్యవసాయదారులు పొలం పనులలో నిమగ్నమయ్యారు. కాగా మరల కురిసిన భారీ వర్షంతో పత్తి పంటకు నష్టం జరిగే అవకాశం ఉందని అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. కాగా భారీగా కురిసిన వర్షానికి మండల కేంద్రానికి సమీపంలోని ఆళ్ళపాడు గ్రామానికి రాకపోకలు బంద్ అయ్యాయి.

రైల్వే అండర్‌బ్రిడ్జి కింద భారీగా వరద రావటంతో అటుగా వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. గోవిందాపురం (ఏ) గ్రామ సమీపంలోని వాగుకు భారీగా వరద వచ్చింది. మండల కేంద్రం బోనకల్ ప్రధాన కూడలిలో భారీగా చేరి వరదతో ప్రయాణీకులు ఇబ్బంది పడ్డారు. ఇటీవల కురిసిన వర్షాలతో అతాలకుతలమైన జనం మరల తిరిగి కురుస్తున్న వర్షాలతో జనం బెంబేలెత్తిపోతున్నారు. జగిత్యాల జిల్లా రాయికల్ ప్రాంతంలో శుక్రవారం కురిసిన వర్షాలతో వాగులు, ఒర్రెలు పొంగిపొర్లుతున్నాయి. దీంతో అయా గ్రామాలు ప్రజల రాకపోకలకు ఇబ్బందిగా మారింది. రాయికల్ మండలం మైతాపూర్, ఇటిక్యాల, రామాజీపేట, సింగరావుపేట వాగులకు వరద నీరు పొటేత్తింది. దాంతో అవి పొంగిపొర్లుతున్నాయి. సమీప గ్రామాల్లోని మొక్కజొన్న, వరి, పత్తి పంటలకు నష్టం వాటిల్లే ప్రమాదముందని రైతులు వాపోతున్నారు. వాగులు, ఒర్రెల సమీపంలోని పంట చేలలో ఇసుక మేటలు వచ్చి చేరడంతో పంటలు దెబ్బతిని రైతులు ఆందోళన చెందుతున్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News