Monday, January 20, 2025

బలూచిస్థాన్‌లో లోయలో వ్యాన్ బోల్తా… 22మంది దుర్మరణం

- Advertisement -
- Advertisement -

22 killed after Van falls into Valley in Balochistan

కరాచి: పాకిస్థాన్ బలూచిస్తాన్ ప్రావిన్స్‌లో బుధవారం ప్యాసింజర్ వ్యాన్ వంద అడుగుల లోతైన లోయలో పడి 22 మంది దుర్మరణం పాలయ్యారు. ప్రమాదం జరిగిన సమయంలో వ్యాన్‌లో 23 మంది ఉన్నారని, వీరిలో 22 మంది మరణించారని పాక్ పత్రిక డాన్ పేర్కొంది. ఓ చిన్నారి తీవ్రంగా గాయపడి ప్రాణాలతో బయటపడినట్టు పేర్కొంది. బుధవారం ఉదయం 23 మందితో వ్యాన్ లొరాలియా నుంచి జోబ్‌కు వెళ్తున్న సమయంలో అక్తర్ జాయ్ సమీపంలో కొండపై నుంచి వ్యాన్ లోయలో పడిపోయిందని జిల్లా డిప్యూటీ కమిషనర్ హఫీజ్ ముహమ్మద్ ఖాసిం తెలిపారు.

ప్రమాదంలో గాయపడిన బాలుడిని చికిత్సకోసం క్వెట్టాకు తరలించారు. మృతుల్లో ఐదుగురు చిన్నారులు, ఐదుగురు మహిళలు, 11మంది వ్యక్తులు మృతి చెందారు. ఈ ఘటనపై పాక్ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో విచారం వెలిబుచ్చారు. బలోచిస్థాన్ ముఖ్యమంత్రి మీర్ అబ్దుల్ కుదోస్ బిజెంజో మృతుల కుటుంబాలకు సంతాపం తెలియచేశారు. గాయపడిన చిన్నారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు.

22 killed after Van falls into Valley in Balochistan

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News