Monday, December 23, 2024

సికింద్రాబాద్ అల్లర్ల ఘటనలో 22 మంది అరెస్టు…

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: సికింద్రాబాద్ అల్లర్ల ఘటనలో 22 మందిని అరెస్టు చేశామని పోలీసులు వెల్లడించారు. ఆందోళనలు ఎక్కువగా సాయి డిఫెన్స్ అకాడమీ అభ్యర్థులు పాల్గొన్నారు. సాయి డిఫెన్స్ అకాడమీకి చెందిన 450 మంది అభ్యర్థులు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ విధ్వంసంలో పాల్గొన్నట్లు పోలీసులు గుర్తించారు. మంచిర్యాల, కరీంనగర్, వరంగల్, గుంటూరు, నిజామాబాద్, మహబూబాబాద్ జిల్లాలకు చెందిన అభ్యర్థులుగా ఉన్నట్టు పోలీసులు తేల్చారు. తెలంగాణ వ్యాప్తంగా అన్ని రైల్వే స్టేషన్‌లలో పూర్తిగా భద్రతా బలగాలు మోహరించాయి. సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ, వరంగల్, ఖాజీ పేట రైల్వే స్టేషన్లకు మూడంచెల భద్రతా ఏర్పాటు చేసినట్టు సమాచారం.  15 వందల నుంచి 2 వేల మంది ఆర్మీ అభ్యర్థులు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పై దాడి చేశారని రైల్వే ఎస్పీ అనురాధ తెలిపారు.  ఈ ఘటనపై కేసు నమోదు చేశామని, వారిపై 143, 147, 307, 435, 427, 448, 336, 332, 341, 149, 150, 151, 152, 3POPPA సెక్షన్ల కింద కేసులు నమోదు చేశామని వెల్లడించారు.  ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News