Monday, December 23, 2024

కేరళ బోటు ప్రమాదం… 22కు చేరిన మృతులు… ఒకే కుటుంబంలో 11 మంది

- Advertisement -
- Advertisement -

తిరువనంతపురం: కేరళ రాష్ట్రంలో జరిగిన బోటు ప్రమాదంలో మృతుల సంఖ్య 22కు చెరిందని అధికారులు తెలిపారు. ఆదివారం రాత్రి 7.30 గంటల ప్రాంతంలో 30 మంది ప్రయాణికులతో వెళ్తున్న బోటు బోల్తాపడింది. గత రాత్రి 11 మృతదేహాలను రెస్య్కూ సిబ్బంది బయటకు తీసి ఎనిమిది మందిని కాపాడి ఆస్పత్రులకు తరలించారు. మృతులలో ఒకే కుటుంబానికి చెందిన 11 మంది ఉన్నారు. చాలా మంది టికెట్ లేకుండానే పడవ ఎక్కినట్లు స్థానికులు ఆరోపణలు చేస్తున్నారు. సాయంత్రం ఆరు గంటల వరకే బోటు ప్రయాణానికి అనుమతి ఉంది.

Also Read: బిఆర్‌ఎస్‌లో భూమిపుత్ర సంఘటన విలీనం

ఆరు గంటల తరువాత బోట్స్ రైడ్స్‌కు అధికారులు ఎందుకు వెళ్లనిచ్చారని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ఈ ఘటనపై కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ సంతాపం వ్యక్తం చేశారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించారు. ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోడీ, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతులు కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. మృతుల కుటుంబాలకు రెండు లక్షల రూపాయల నష్టం పరిహారం ఇస్తామని మోడీ ప్రకటించారు. సహాయక చర్యల్లో కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నాలని రాహుల్ పిలుపునిచ్చారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News