Monday, December 23, 2024

17న 22 ఎంఎంటిఎస్ రైళ్ళు రద్దు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ ః జంట నగరాల మధ్య సేవలు అందించే పలు ఎంఎంటిఎస్ రైళ్ళను నాలుగు రోజుల పాటు రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. సికింద్రాబాద్,సనత్‌నగర్ రైల్వేస్టేషన్‌లలో నిర్వహణ పనులు కారణంగా 17వ తేదీ వరకు సుమారు 22 ఎంటిఎస్ సర్వీసులను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.

జూన్ 14,15 తేదీల్లో లింగంపల్లి హైదరాబాద్, హైదరాబాద్ లింగంపల్లి, మధ్య 10 రైళ్ళు, జూన్ 14 నుంచి 17వ తేదీ వరకు ఉందానగర్ లింగంపల్లి, లింగంపల్లి ఫలక్‌నుమా, రామచంద్రాపురం ఫల్‌క్‌నుమా రూట్లలో పలు రైలు సర్వీసులను రద్దు చేస్తున్నట్లు దక్షణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News