- Advertisement -
ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ ప్రాంతంలో వేర్వేరు ఆపరేషన్లలో మొత్తం 22 మంది నక్సలైట్లను అరెస్టు చేసినట్లు గురువారం పోలీసులు తెలిపారు. వారిలో 18 మంది నక్సలైట్లను బీజాపూర్ జిల్లాలో గురువారం అరెస్టు చేశారు. మిగతా నలుగురు నక్సలైట్లను మంగళవారం సుక్మాలో అరెస్టు చేశారని వారన్నారు. ఈ ఆపరేషన్‌లో స్థానిక పోలీసులు, 201, 204,205,206,210 సిఆర్‌పిఎఫ్ బలగాలు, ఎలైట్ యూనిట్ కోబ్రా బలగాలు పాల్గొన్నాయి. మావోయిస్టుల నుంచి మందుగుండు సామాగ్రి, కరపత్రాలను కూడా స్వాధీనం చేసుకున్నారు.రాజ్‌పెంట, సర్కేగుడా గ్రామాలలోని అడవులలో ఏడుగురు నక్సలైట్లను 210 కోబ్రా బెటాలియన్ పట్టుకుంది. వారి నుంచి రెండు టిఫిన్ బాంబులు, కార్డెక్స్ వైర్, బ్యాటరీ, దినసరి దినుసులు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసు అధికారి తెలిపారు.
- Advertisement -