- Advertisement -
ఛత్తీస్‌గఢ్ లోని బీజాపూర్ జిల్లాలో 22 మంది నక్సల్స్ అరెస్ట్ అయ్యారని గురువారం పోలీసులు వెల్లడించారు. టేకుమట్ల గ్రామం సమీపాన అడవుల్లోంచి తక్కువ క్యాడర్ నక్సల్స్ ఏడుగురు పట్టుబడ్డారని, మరో ఆరుగురు బెల్చార్ గ్రామ అడవుల్లో దొరికారని , ఇంకో తొమ్మిది మంది కందకర్క గ్రామం అడవిలో పట్టుబడ్డారని పోలీసులు వివరించారు. వీరి దగ్గర నుంచి టిఫిన్‌బాంబులు, జిలాటిన్ స్టిక్స్, డిటొనేటర్లు, ఎలక్ట్రిక్ వైర్లు, బ్యాటరీలు, మావోయిస్టు కరపత్రాలు , ఇతర వస్తువులు స్వాధీనం అయ్యాయని చెప్పారు. అరెస్టయిన వీరంతా 19 45 ఏళ్ల లోపు వారే
- Advertisement -