Sunday, December 22, 2024

యుపిలో చెరువులో పడ్డ ట్రాక్టర్

- Advertisement -
- Advertisement -

22 people died after tractor fell into pond

మృతులంతా పిల్లలు , స్త్రీలే
చంద్రికాదేవి దర్శన తిరుగుముఖంలో ఘోరం

కాన్పూర్ : ఉత్తరప్రదేశ్‌లో ఘోర ప్రమాదం జరిగింది. కాన్పూర్ వద్ద యాత్రికులతో వస్తున్న ఓ ట్రాక్టరు అదుపు తప్పి చెరువులో పడటంతో 22 మంది మృతి చెందారు. మృతులంతా మహిళలు, చిన్నపిల్లలే , పాతిక మంది వరకూ ఈ ఘటనలో తీవ్రంగా గాయపడి ఆసుపత్రి పాలయ్యారు. ఈ ఘటన శనివారం రాత్రి కాన్పూర్ జిల్లాలోని ఘటంపూర్ ప్రాంతంలో జరిగిందని కాన్పూర్ జిల్లా కలెక్టర్ , పోలీసు అధికారులు తెలిపారు. ఉన్నావో లోని చంద్రికాదేవి ఆలయంలో సందర్శనకు వెళ్లి స్వగ్రామాలకు వెళ్లుతుండగా దుర్ఘటన జరిగింది. ప్రమాదం జరిగినప్పుడు ట్రాక్టరులో 50 మంది గ్రామీణులు ఉన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News