Friday, November 22, 2024

ఎర్రబెల్లి ప్రదీప్‌రావ్‌కు హైకోర్టులో ఊరట..

- Advertisement -
- Advertisement -

ఎర్రబెల్లి ప్రదీప్‌రావ్‌కు హైకోర్టులో ఊరట
తదుపరి ఉత్తర్వులు ఇచ్చేవరకు
2+2 భద్రత కల్పించాలని ప్రభుత్వానికి ఆదేశాలు
హైదరాబాద్: రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు సోదరుడు ఎర్రబెల్లి ప్రదీప్‌రావ్‌కు హైకోర్టులో ఊరట లభించింది. గతంలో ఉన్న భద్రతను యథావిధిగా కొనసాగించాలని న్యాయస్థానం ఆదేశించింది. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా భద్రత తొలగించారని ఎర్రబెల్లి ప్రదీప్‌రావ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తనకు భద్రతను ఎందుకు తొలగించారో తెలియదని పిటిషన్‌లో పేర్కొన్నారు. తనకు ప్రాణహాని ఉందని 2+2 భద్రత కల్పించాలని ఉన్నత న్యాయస్థానాన్ని కోరారు. దీనిపై బుధవారం విచారణ జరిపిన న్యాయస్థానం తదుపరి ఉత్తర్వులు ఇచ్చేవరకు 2+2 భద్రత కల్పించాలని ప్రభుత్వానికి ఆదేశించింది. ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది.

కామారెడ్డి మాస్టర్ ప్లాన్‌పై కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశం
కామారెడ్డి మాస్టర్ ప్లాన్‌పై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలంటూ హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. కామారెడ్డి మాస్టర్ ప్లాన్‌పై దాఖలైన పిటిషన్‌పై బుధవారం ఉన్నత న్యాయస్థానం విచారణ జరిపింది. మాస్టర్ ప్లాన్ మున్సిపల్ కౌన్సిల్ విత్ డ్రా చేసుకుందని గవర్నమెంట్ ప్లీడర్ న్యాయస్థానానికి తెలిపారు.

ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోలేదని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. టౌన్ ప్లానింగ్ యాక్ట్ సెక్షన్ 14 ప్రకారం ప్రభుత్వానికి అధికారాలు ఉన్నాయని.. మాస్టర్ ప్లాన్ పరిగణలోకి తీసుకోవాలా..? లేదా..? అనేది ప్రభుత్వ నిర్ణయంగా పేర్కొన్నారు. మున్సిపల్ కౌన్సిల్ నిర్ణయంపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందని ఈ సందర్భంగా హైకోర్టు ప్రశ్నించింది. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేస్తూ.. తదుపరి విచారణను ఫిబ్రవరి 22వ తేదీకి వాయిదా వేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News