Friday, December 20, 2024

పిడుగుపాటుకు 22 గొర్రెలు మృతి

- Advertisement -
- Advertisement -

కుల్కచర్ల: పిడుగుపాటుకు గురై 22 గొర్రెలు మృతి చెందిన సంఘటన మండల పరిధిలోని సాల్వీడ్ గ్రామంలో చోటుచేసు కుంది. స్థానికుల తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన బసమ్మ, ఆంజిలయ్య, క్రిష్ణయ్య ఆదివారం ఎప్పటిలాగే గొర్రె మందను గ్రామ శివారులో మేతకు తీసుకువెళ్లారు. మధ్యాహ్నం ఈదురుగాలులు, ఉరు ములతో కూడిన వర్షం కురిసింది. ఈ క్రమంలో కాపరి అక్కడే ఉన్న పెద్ద చెట్టు కిందకు తీసుకెళ్లి అక్కడే ఉన్న మరో చెట్టు కింద నిలు చున్నారు.

కొద్ది సేపటికే మేకలు నిలిచి ఉన్న చెట్టుపై పిడుగుపడటంతో చెట్టు కింద ఉన్న గొర్రెల మందలో 22 గొర్రెలు మృతి చెందాయి. ము గ్గురు కాపరు లకు చెందిన గొర్రెల విలువ సుమారు రూ. లక్షా 50 వేల వరకు ఆస్తి నష్టం జరిగిందని స్థానికులు తెలిపారు. ప్రభుత్వం వారిని ఆదుకోవాలని బాధితులు వాపోయారు. పిడుగుపాటుకు కొద్దిదూరంలో గొర్రెల కాప రులు ఉండడంతో తృటిలో ప్రాణాపాయం తప్పింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News