Sunday, December 22, 2024

అయ్యప్ప భక్తుల కోసం 22 ప్రత్యేక రైళ్లు

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్:  అయ్యప్ప భక్తుల కోసం దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. భక్తుల రద్దీ పెరుగుతుండటంతో అదనపు రైళ్లను నడపాలని నిర్ణయించింది. ఈ క్రమంలోనే 22 ప్రత్యేక రైళ్లను శబరిమలకు నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే పేర్కొసింది. సికింద్రాబాద్- కొల్లాం, నర్సాపూర్- కొట్టాయం, కాచిగూడ- కొల్లాం, కాకినాడ టౌన్-కొట్టాయం మధ్య ఈ ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది. ఈ రైళ్లలో ఫస్ట్ ఎసి, 2 ఎసి, 3ఎసి, స్లీపర్ క్లాస్, జనరల్ క్లాస్ బోగీలు ఉంటాయని దక్షిణ మధ్య రైల్వే పేర్కొంది.

ఈ ప్రత్యేక రైళ్లు రాను పోను ఆగే స్టేషన్ల వివరాలు ఇలా…
సికింద్రాబాద్-కొల్లాం-సికింద్రాబాద్ (07129/07130) రైళ్లు నల్గొండ, మిర్యాలగూడ, నడికుడి, పిడుగురాళ్ల, సత్తెనపల్లి, గుంటూరు, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, కావలి, నెల్లూరు, గూడూరు, రేణిగుంట, కాట్‌పాడి, జోలర్‌పేట్, సేలం, ఈరోడ్, తిరుప్పూర్, కోయంబత్తూర్, పాలక్కడ్, త్రిసూర్, ,ఆలువా, ఎర్నాకుళం టౌన్, కొట్టాయం, చెంగనస్సెరి, తిరువళ్ల, చెంగనూర్, మావెలికెర స్టేషన్ల మీదుగా రాకపోకలు కొనసాగించనుంది.

నర్సాపూర్- కొట్టాయం-నర్సాపూర్ (07119/07120) ప్రత్యేక రైళ్లు భీమవరం, భీమవరం టౌన్, ఆకివీడు, కైకలూరు, గుడివాడ, విజయవాడ, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట, తిరుపతి, చిత్తూరు, కాట్‌పాడి, జోలర్‌పేట్, సేలం, ఈరోడ్, తిరుప్పూర్, కోయంబత్తూర్, పాలక్కాడ్, త్రిసూర్, ఆలువా, ఎర్నాకుళం టౌన్ మీదుగా రాకపోకలు కొనసాగించనుంది.

కాచిగూడ-  కొల్లాం  -కాచిగూడ (07123/07124) రైళ్లు మల్కాజిగిరి, నల్గొండ, మిర్యాలగూడ, నడికుడి, సత్తెనపల్లి, గుంటూరు, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట, కాట్‌పాడి, జోలర్‌పేట్, సేలం, ఈరోడ్, తిరుప్పూర్, కోయంబత్తూరు, పాలక్కాడ్, త్రిసూర్, ఆలువా, ఎర్నాకుళం టౌన్, కొట్టాయం, చెంగనస్సెరి, తిరువళ్ల, చెంగనూర్, మావెలికెర స్టేషన్ల మీదుగా రాకపోకలు కొనసాగించనుంది.

కాకినాడ టౌన్ -కొట్టాయం- కాకినాడ (07126/07126) ప్రత్యేక రైళ్లు సామర్లకోట్, అనపర్తి, రాజమండ్రి, నిడదవోలు, తణుకు, భీమవరం టౌన్, ఆకివీడు, కైకలూరు, గుడివాడ, విజయవాడ, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట, కాట్‌పాడి, జోలర్‌పేట్, సేలం, ఈరోడ్, తిరుప్పూర్, కోయంబత్తూరు, పాలక్కాడ్, త్రిసూర్, ఆలువా, ఎర్నాకుళం టౌన్ స్టేషన్ల మీదుగా రాకపోకలు కొనసాగించనుంది.

సికింద్రాబాద్ -కొల్లాం-సికింద్రాబాద్ (07127/07128) ప్రత్యేక రైళ్లు కాచిగూడ, ఉందానగర్, షాద్‌నగర్, జడ్చర్ల, మహబూబ్‌నగర్, వనపర్తి రోడ్డు, శ్రీరామ్నగర్, గద్వాల్, కర్నూలు సిటీ, డోన్, గుత్తి, తాడిపత్రి, ఎర్రగుంట్ల, కడప, రాజంపేట, రేణిగుంట, తిరుపతి, చిత్తూరు, కాట్‌పాడి, జోలర్‌పేట్, సేలం, ఈరోడ్, తిరుప్పూర్, కోయంబత్తూరు, పాలక్కాడ్, త్రిసూర్, ఆలువా, ఎర్నాకుళం టౌన్, కొట్టాయం, చెంగనస్సెరి, తిరువళ్ల, చెంగనూర్, మావెలికెర స్టేషన్ల మీదుగా రాకపోకలు కొనసాగించనుంది.

Kollam- Secunderabad

 

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News