Friday, December 20, 2024

22 అంతస్తుల భవనం పైనుంచి దూకి వైద్య విద్యార్థిని మృతి

- Advertisement -
- Advertisement -

లక్నో: వైద్య విద్యార్థిని 22 అంతస్తుల భవనం పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం ఘజియాబాద్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… ఢిల్లీలోని వికాస్‌పూర్ ప్రాంతానికి చెందిన అస్టా శర్మ అనే యువతి ఘజియాబాద్‌లో ఓ ప్రైవేటు కాలేజీలో బిడిఎస్ చదువుతోంది. ఇంద్రపూరమ్‌లోని ఓ హౌసింగ్ సోసైటీలో తన స్నేహితుడు రోహిత్ ఖన్నా వద్దకు అప్పుడప్పుడు వెళ్తూ ఉండేది. రోహిత్, అస్టా ఇద్దరు గాఢప్రేమలో ఉన్నట్టు సమాచారం. ఆమె మానసికంగా తీవ్ర ఒత్తిడిలో ఉండడంతో మానసిక నిపుణుల వద్ద వైద్యం తీసుకుంటుంది. శుక్రవారం రోహిత్ ఇంటికి రెండు సార్లు అస్టా వెళ్లింది. ఇద్దరు మధ్య ఏం జరిగిందో కానీ ఆమె 22 అంతస్తుల భవనం పైకి ఎక్కి కిందకు దూకింది. ఘటనా స్థలంలోనే చనిపోవడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రోహిత్‌ను అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. మృతదేహాన్ని శవ పరీక్ష నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. తలకు బలమైన గాయాలు కావడంతో ఆమె చనిపోయిందని పోలీసులు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News