Monday, December 23, 2024

రాజస్థాన్‌లో 22 మంది మంత్రుల ప్రమాణస్వీకారం

- Advertisement -
- Advertisement -

జైపూర్: రాజస్థాన్‌లో శనివారం కొత్త మంత్రివర్గం కొలువుదీరింది. మంత్రులుగా 22 మంది బిజెపి ఎమ్మెల్యేలు రాజ్‌భవన్‌లో పదవీ స్వీకార ప్రమాణం చేశారు. వీరిలో 12 మంది క్యాబినెట్ మంత్రులుగా, ఐదుగురు సహాయ(స్వతంత్ర హోదా) మంత్రులుగా, ఐదుగురు సహాయ మంత్రులుగా ప్రమాణం చేశారు. రాష్ట్ర గవర్నర్ కల్‌రాజ్ మిశ్రా ఎమ్మెల్యేల చేత ప్రమాణం చేయించారు. ఎమ్మెల్యేలుగా గెలిచిన ఇద్దరు బిజెపి ఎంపీలు రాజ్‌వర్ధన్ సింగ్ రాథోర్, కిరోడి లాల్ మీనా కూడా మంత్రులుగా ప్రమాణం చేసిన వారిలో ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News