Wednesday, January 22, 2025

అమెరికాలో జన్మతః పౌరసత్వం రద్దుపై న్యాయపోరాటం

- Advertisement -
- Advertisement -

వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధికారం చేపట్టిన మొదటి రోజే పలు కీలక ఉత్తర్వులు జారీ చేశారు. చెప్పినట్టుగానే వలసలను కట్టడి చేసే దిశగా కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఇందులో జన్మత  వచ్చే పౌరసత్వం రద్దు కూడా ఒకటి. దీనిపై డెమోక్రటిక్ పార్టీ నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోంది. వారి పాలనలో ఉన్న 22 రాష్ట్రాలు ఈ నిర్ణయాన్ని న్యాయస్థానాల్లో సవాల్ చేశాయి. 22 రాష్ట్రాలు కలిపి రెండు వేర్వేరు వ్యాజ్యాలు దాఖలు చేశాయి. అధ్యక్షుడి నిర్ణయం రాజ్యాంగ విరుద్ధమని కాలిఫోర్నియా అటార్నీ జనరల్ వెల్లడించారు. ఈ ఉత్తర్వులను అమల్లోకి రాకుండా వెంటనే నిలిపివేయాలని తమ వ్యాజ్యంలో కోర్టును కోరారు. సరైన పత్రాలు లేకుండా అమెరికాలో నివసిస్తున్న వారు దాదాపు 1.40 కోట్ల మంది ఉంటారని అంచనా.

వీరిలో భారతీయుల సంఖ్య సుమారు 7.25 లక్షలు. మెక్సికో సార్విడార్ ప్రజల తరువాత ఎక్కువగా ఉన్నది మనవారే. ఎన్నికల ప్రచారం నుంచి ఇలాంటి వారి విషయంలో పదేపదే తన వైఖరిని ట్రంప్ వెల్లడించారు. బాధ్యతలు చేపట్టాక స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. వలస వచ్చిన వారికి అమెరికా గడ్డపై పిల్లలు పుడితే ఆ చిన్నారులకు పౌరసత్వాన్ని అందించే చట్టాన్ని ట్రంప్ రద్దు చేశారు. ఆ దేశ రాజ్యాంగంలో 14 వ సవరణ ప్రకారం పిల్లలకు ఈ హక్కు సంక్రమిస్తుంది. దీనిపై ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ జారీ చేశారు. ఆ దేశ జనాభాలో సుమారు 50 లక్షల ( 1.47 శాతం )మంది భారతీయులున్నారు. వీరిలో మూడోవంతు మంది అమెరికాలో పుట్టిన వారే. మిగిలిన వారంతా వలసదారులు. న్యాయపరంగా ఎలాంటి అవరోధం లేకపోతే సంతకం చేసిన 30 రోజుల్లో ఈ ఉత్తర్వు అమలు లోకి వస్తుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News