Thursday, January 23, 2025

అమెరికాలో కాల్పులు జరిపిన యువకుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు!

- Advertisement -
- Advertisement -

Robert

వాషింగ్టన్:  చికాగో నగర శివారులోని హైలాండ్ పార్క్‌లో సోమవారం  ‘జూలై నాలుగు పరేడ్‌’లో కాల్పులు జరిపినందుకు 22 ఏళ్ల వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనలో కనీసం ఆరుగురు మరణించగా, 36 మంది గాయపడ్డారు. ఆ ప్రాంతానికి చెందిన రాబర్ట్ ఇ క్రైమో3ని అదుపులోకి తీసుకున్నామని, అభియోగాలు నమోదు చేస్తామని పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో శక్తిమంతమైన తుపాకీని ఉపయోగించినట్లు సమాచారం.

ఏబిసి న్యూస్‌కి చెందిన చికాగో అనుబంధ సంస్థ విడుదల చేసిన వీడియోలో పోలీసులు ఒక కారును చుట్టుముట్టారు,  ఆపై క్రిమో తన చేతులు పైకెత్తి కారు నుంచి బయటికి వచ్చినట్లు ‘రాయిటర్స్’ తెలిపింది. పోలీసులు అతనిని అదుపులోకి తీసుకునే ముందు క్రైమో నేలపై సాష్టాంగపడి కనిపించాడు.

కాల్పులు జరిగిన దాదాపు ఎనిమిది గంటల తర్వాత అరెస్టు జరిగిందని చికాగోకు చెందిన వార్తాపత్రిక ‘చికాగో ట్రిబ్యూన్’ తెలిపింది. క్రిమో 2010 సిల్వర్ హోండా ఫిట్‌ను నడుపుతున్నట్లు తెలిసింది.  అమెరికా హైవే 41, బక్లీ రోడ్ సమీపంలో ఉత్తర చికాగో పోలీసులు అతడిని గుర్తించారు.పోలీసు అధికారి క్రైమోను ఆపడానికి ప్రయత్నించాడు, కానీ  ఆపడానికి ముందు అతను పారిపోడానికి ప్రయత్నించాడని  హైలాండ్ పార్క్ పోలీస్ చీఫ్ లౌ జోగ్మెన్ ను ఉటంకిస్తూ ఆ వార్తాపత్రిక పేర్కొంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News