Wednesday, January 22, 2025

ఢిల్లీలో 22 ఏళ్ల యువతికి మంకీపాక్స్

- Advertisement -
- Advertisement -

22 year old woman tested monkeypox positive in Delhi

హైదరాబాద్: దేశ రాజధాని ఢిల్లీలో మరో మంకీపాక్స్ కేసు నమోదైంది. మంకీపాక్స్ లక్షణాలతో లోక్‌నాయక్ జైప్రకాశ్ నారాయన్ ఆస్పత్రిలో చేరిన 22 ఏళ్ల యువతికి పాజిటివ్ వచ్చింది. దీంతో న్యూఢిల్లీలో మంకీపాక్స్ కేసుల సంఖ్య ఐదుకు చేరింది. దవాఖానాలో చేరిన యువతికి శుక్రవారం పాజిటివ్ వచ్చిందని ఎల్‌ఎన్‌జేపీ డాక్టర్ సురేశ్ కుమార్ చెప్పారు. ఈమధ్యకాలంలో ఆమె ఇతర దేశాలకు వెళ్లక పోయినా నెల రోజుల క్రితం విదేశాలకు వెళ్లి వచ్చారని చెప్పారు. ఆస్పత్రిలో ప్రస్తుతం నలుగురు మంకీపాక్స్ బాధితులు చికిత్స పొందుతున్నారు. మరొకరు కోలుకుని డిశ్చార్జి అయ్యారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News