Monday, January 27, 2025

220 కిలోల గంజాయి స్వాధీనం

- Advertisement -
- Advertisement -

పటాన్ చెరు ః సంగారెడ్డి జిల్లా, పటాన్‌ చెరు ముత్తంగి ఔటర్ రింగ్ రోడ్డు టోల్ ప్లాజా వద్ద ఎక్సైజ్ పోలీసులు
220 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు పటాన్‌చెరు ఎక్సైజ్ పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఒక వాహనంలో ఒరిస్సా రాష్ట్రం నుంచి మహారాష్ట్రకు అక్రమంగా గంజాయిని తరలిస్తుండగా పట్టుకున్నారు. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ సుమారు రూ.55 లక్షలు ఉంటుందని ఎక్సైజ్ సిఐ పరమేశ్వర్ గౌడ్ విలేఖరులకు తెలిపారు. గంజాయిని తరలిస్తున్న ముగ్గురు నిందితుల్లో ఇద్దరు పరారీ కాగా, చంద్రకాంత్ అనే వ్యక్తిని పట్టుకున్నామని తెలిపారు. నిందితుడిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించనున్నట్టు తెలిపారు. పరారీలో ఉన్న విశాల్ దిలీప్, అజామ్‌లను త్వరలో పట్టుకుంటామని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News