Wednesday, September 18, 2024

2,250 కిలోల నల్లబెల్లం పట్టివేత

- Advertisement -
- Advertisement -

నాటుసారా తయారీకి వినియోగించే నల్లబెల్లం సరఫరా చేసే ఇద్దరు వ్యక్తులపై నాగర్‌కర్నూల్ ఎక్సైజ్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ సందర్భంగా నిందితుల నుంచి 2,250 కిలోల నల్లబెల్లం స్వాధీనం చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూల్ నుంచి చాలా కాలంగా నాగర్‌కర్నూల్ జిల్లాలోని తెలకపల్లి, కొల్లాపూర్ ప్రాంతాలకు నాటుసారాకు వినియోగించే బెల్లం, పటికను పోలీసులకు దొరకకుండా సరఫరా చేస్తూ ఉన్న ఒక వ్యక్తిని అరెస్ట్ చేశారు. మరో వ్యక్తి పరారీలో ఉన్నారు. మహబూబ్‌నగర్ ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ పోలీసులు పక్కాగా అందుకున్న సమాచారం మేరకు ఆదివారం తెల్లవారుఝామున బిజినేపల్లి బస్టాండ్ దగ్గర రోడ్డు వద్ద వాహనాలు తనిఖీలు చేపట్టారు. కర్నూల్ నుంచి వచ్చిన బొలెరో పిక్‌అప్ వాహనాన్ని నిలిపి తనిఖీలు నిర్వహించగా అందులో ఉన్న 75 బ్యాగుల బెల్లం,

ఒక బ్యాగులో 30 కేజీలు మొత్తం 2250 కేజీల బెల్లాన్ని, 5 లీటర్ల నాటుసారాను పట్టుకున్నారు. ఈ బెల్లాన్ని సరఫరా చేస్తున్న దేవుల తిరుమలాపూర్ గ్రామం పెద్దకొత్తపల్లి మండలానికి చెందిన పుట్ట శ్రీనివాస్‌ను అరెస్ట్ చేశారు. వట్టిపల్లి తండా, తెలకపల్లి మండలంకు చెందిన ముడావత్ ప్రతాప్ పరారీలో ఉన్నాడు. అతడిని త్వరలోనే అరెస్టు చేస్తామని నాగర్‌కర్నూల్ ఆబ్కారీ స్టేషన్ సిఐ జి.కళ్యాణ్ తెలిపారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ పోలీసులు ప్రకారం వాహనం, బెల్లం విలువ రూ.12 లక్షలుగా ఉంటుందని అంచనా వేశారు. బెల్లాన్ని పట్టుకున్న ఎన్‌ఫోర్స్‌మెంట్ ఎఇఎస్ శ్రీనివాస్, సిఐలు బాలకృష్ణారెడ్డి, వెంకటేశ్వర్ రెడ్డి, శారద, ఎస్‌ఐ సృజన్‌రావుతో పాటు సిబ్బంది చంద్రయ్య, సూర్యం, మునిందర్, జనార్దన్ తదితరులు పాల్గొన్నారు. బెల్లం సరఫరా చేస్తున్న వాహనాన్ని పట్టుకున్న ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులను, సిబ్బందిని, ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అసిస్టెంట్ కమిషనర్ విజయభాస్కర్ రెడ్డి అభినందించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News