Monday, December 23, 2024

శంషాబాద్ విమానాశ్రయంలో భారీగా సిగరేట్ల పట్టివేత

- Advertisement -
- Advertisement -

రంగారెడ్డి: శంషాబాద్ విమానాశ్రయంలో శనివారం ఉదయం భారీగా సిగరెట్లను పట్టకున్నారు. అక్రమంగా సిగరేట్లను తరలిస్తున్న ఆరుగురుని పట్టుకున్నారు. శుక్రవారం సాయంత్రం 6ఇ1406 విమానంలో వచ్చిన ఆరుగురు ప్రయాణీకులను కస్టమ్స్ అధికారులు తనిఖీలు చేయగా, వారి వద్ద నుంచి 22,600 సిగరెట్లతో పాటు 940 ఈ-సిగరెట్లను పట్టుకున్నారు. వీటి విలువ దాదాపుగా రూ.11.66 లక్షలు ఉంటాయని అధికారులు అంచనా వేస్తున్నారు. వీటిని సీజ్ చేయడంతో తదుపరి విచారణ చేపడుతామని కస్టమ్స్ అధికారులు పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News