Monday, December 23, 2024

దేశంలో కొత్తగా 22,775 కరోనా కేసులు

- Advertisement -
- Advertisement -

22775 Corona Positive cases in India

 

న్యూఢిల్లీ: దేశంలో రోజు రోజుకు కరోనా కేసులు పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 22,775 కరోనా పాజిటీవ్ కేసులు నమోదుకాగా 406 మంది చనిపోయారని కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజాగా వెల్లడించింది. నిన్నటితో పోలిస్తే ఆరు వేల కేసులు ఎక్కువగా అధికంగా నమోదయ్యాయి. దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3.48కోట్లు దాటింది. ఇక కరోనా బారిన పడి ఇప్పటివరకు దేశంలో 4,81,486మంది ప్రాణాలు కోల్పోయారు. గత 24 గంటల్లో కరోనా నుంచి 8949మంది కోలుకోగా.. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 3.42కోట్లకు పైగా మంది కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 1,04, 781 మంది కరోనాతో చికిత్స పొందుతున్నారు. దేశంలో ఇప్పటివరకు 143.15 కోట్లకు పైగా వ్యాక్సిన్‌ డోసులు పంపిణీ చేశామని ఆరోగ్య శాఖ తెలిపింది.

దేశంలో ఒమిక్రాన్ చాపకింద నీరులా విస్తరిస్తోంది. దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 1431కి చేరుకుంది. అత్యధిక కేసులు ఢిల్లీలో (351) నమోదుకాగా వరసగా తమిళనాడు(118), గుజరాత్ (115), కేరళ(109), రాజస్థాన్(69), తెలంగాణ(62) కేసులు నమోదయ్యాయి. ఒమిక్రాన్ నుంచి 488 మంది కోలుకొని ఇంటికి వెళ్లిపోయారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News