Friday, November 22, 2024

పెను విషాదం.. ఇథియోపియాలో మట్టిపెళ్లలు విరిగిపడిన ఘటనలో 229 మంది మృతి

- Advertisement -
- Advertisement -

అడిస్ అబాబా: ఇథియోపియాలో ఒక మారుమూల ప్రాంతంలో భారీ వర్షాల వల్ల మట్టిపెళ్లలు విరిగిపడగా కనీసం 229 మంది వ్యక్తులు మరణించినట్లు స్థానిక అధికారులు మంగళవారం వెల్లడించారు. వారిలో చాలా మంది అంతకుముందు మట్టిపెళ్లలు విరిగిపడిన దుర్ఘటనలో ప్రాణాలతో బయటపడిన వారిని రక్షించేందుకు ప్రయత్నించారని అధికారులు తెలిపారు. దక్షిణ ఇథియోపియాలో కెంచో షాచా గోజ్ది జిల్లాలో మట్టిపెళ్లలు విరిగిపడడం వల్ల మరణించినవారిలో చిన్నపిల్లలు, గర్భిణులు ఉన్నారని స్థానిక పాలనాధికారి దాగ్మావి అయెలె తెలియజేశారు.

ఆ ప్రాంతంలో అన్వేషణ కార్యక్రమాలు కొనసాగగా సోమవారం 55గా ఉన్న మృతుల సంఖ్య మంగళవారం 229కు పెరిగిందని గోఫా జోన్ కమ్యూనికేషన్స్ కార్యాలయం అధిపతి కస్సాహున్ అబేనెహ్ తెలిపారు, మట్టిపెళ్లలు విరిగిపడిన ప్రాంతం గోఫా జోన్ పరిధిలోనిది. కాగా, బురదలో నుంచి కనీసం ఐదుగురిని సజీవంగా వెలుపలికి తీసుకువచ్చినట్లు అయెలె తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News