Sunday, December 22, 2024

అసెంబ్లీ బరిలో 2290 మంది

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా అసెంబ్లీ ఎన్నికల్లో 2,290 మంది అభ్యర్థులు పోటీలో తలపడుతున్నారు. అత్యధికంగా గ్రేటర్‌లోని ఎ ల్బీనగర్‌లో 48 మంది బరిలో నిలుస్తుండ గా తరువాత గజ్వేల్‌లో 44 మంది పోటీ చేస్తుండగా, కామారెడ్డిలో 39మంది పో టీలో ఉన్నారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో 1,821 మంది పోటీలో ఉంటే ఈసారి జరిగే ఎన్నికల్లో పోటీచేసే వారి సంఖ్య 469కి పెరిగింది. సంఖ్యలో నామినేషన్లు దాఖలు చేయగా ఇందులో 606 నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. ఈనెల 13వ తేదీ జరిగిన స్క్రూట్నీలో 608 మంది పోటీ నుంచి వైదొలిగారు.

ఈసారి 6 నుంచి 10 మంది అభ్యర్థులు పోటీచేస్తున్న నియోజకవర్గాలు 6 ఉంటే, 10 నుంచి 15 మంది పోటీ చేస్తున్న ని యోజకవర్గాలు 46 ఉన్నాయి. మిగిలిన 67 నియోజకవర్గాల్లో 15 మంది కంటే ఎక్కువ అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఒ క్కో నియోజకవర్గంలో సగటున 19 మం ది పోటీలో పడగా గత ఎన్నికల్లో సగటున 15 మంది బరిలో నిలిచారు. అభ్యర్థుల సంఖ్యలో గజ్వేల్‌ను మించిపోయింది ఎ ల్బీనగర్ నియోజకవర్గం. మునుగోడులో సైతం 39 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. పాలేరులో 37 మంది, నాంపల్లిలో 34 మంది, మల్కాజిగిరిలో 33 మంది చొప్పున పోటీచేస్తున్నారు. అత్యల్పంగా 7 నామినేషన్లు నారాయణపేట, బాన్సువాడ నియోజక వర్గాల్లో వచ్చాయి. ఓటర్ల సంఖ్య గత ఎన్నికల కంటే ఈసా రి 45.42 లక్షల ఓట్లు పెరిగాయి. గత ఎన్నికల్లో ఓటర్ల సంఖ్య 2.80 కోట్లు ఉం టే ఈసారి అది 3.26 కోట్లకు పెరిగింది. ఇందులో మొదటిసారి ఓటర్లు 10 లక్షల మంది ఉన్నారు. 2018లో పోలింగ్ కేంద్రాల సంఖ్య 32,184 ఉండగా, ఈ అధికారులు 36,367 కేంద్రా లు ఏర్పాటు చేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News