Monday, December 23, 2024

ఆత్మహత్యకు పాల్పడిన సోషల్ మీడియా కంటెంట్ క్రియేటర్

- Advertisement -
- Advertisement -

రాయ్‌గఢ్‌: 22 ఏళ్ల సోషల్ మీడియా కంటెంట్ క్రియేటర్ తన ఇంట్లో ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన ఛత్తీగఢ్‌లోని రాయ్‌గఢ్‌ లో చోటు చేసుకుంది. వివరాలలోకి వెళితే.. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మంగళవారం యువతి తన ఇంటి టెర్రస్‌పై వాటర్ ట్యాంక్ కు ఉన్న పైపుకు కండువాతో ఉరి వేసుకొని మృతి చెందినట్లు తెలిపారు. వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. స్ధానికుల సమాచారం మేరకు ఘటన స్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని కిందకి దించి పోస్ట్ మార్టం నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు.

మృతదేహం వద్ద ఎలాంటి సుసైడ్ నోట్ లభించలేదని పోలీసులు తెలిపారు. యూట్యూబ్ మరియు సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో ఆమె యాక్టివ్‌గా ఉండేదని మరియు ఇన్‌స్టాగ్రామ్‌లో 11,000 మంది ఫాలోవర్లు ఉన్నారని పోలీసులు పేర్కొన్నారు. ఈ ఘటన పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News