ఫైజర్ ఎన్ బయోటెక్స్ వ్యాక్సిన్ తీసుకున్నాక విషాదాలు
ఓస్లో : నార్వేలో ‘ఫైజర్ ఎన్ బయోటెక్’ వ్యాక్సిన్ కొన్ని కుటుంబాల్లో విషాదం నింపింది. వ్యాక్సిన్ తీసుకున్న వారిలో 23 మంది వృద్ధులు మృత్యువాత పడ్డారు. దాంతో నార్వే ప్రభుత్వం వృద్ధులు, అనారోగ్య సమస్యలు ఉన్నవారు వ్యాక్సిన్ తీసుకోవద్దని వెంటనే సూచించింది. మరణాలకు కారణాలు తెలసుకునేందుకు విస్తృత దర్యాప్తుకు ఆదేశించింది. ‘ఫైజర్ ఎన్ బయోటెక్ అభివృద్ధి చేసిన కోవిడ్ వ్యాక్సిన్ ఫస్ట్ డోసు తీసుకున్న వారిలో 23 మంది వృద్ధులు మరణించారు. వీరిలో 13 మందికి శవపరీక్షలు నిర్వహించగా టీకా తీసుకున్న తర్వాత వచ్చే సాధారణమైన సైడ్ ఎఫెక్ట్ తలెత్తి అవి తీవ్రంగా మారి మరణించారు’ అని నార్వేజియన్ మెడిసిన్స్ ఏజెన్సీ తెలిపింది. అంతేకాక వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కనిపించే సాధారణ సైడ్ ఎఫెక్ట్ కూడా బాగా బలహీనంగా ఉన్న వారిలో తీవ్రంగా మారాయని ఆ ఏజెన్సీ వెల్లడించింది.