Saturday, December 21, 2024

కేరళలో పేలుళ్లు: ఒకరు మృతి…. 23 మందికి గాయాలు

- Advertisement -
- Advertisement -

తిరువనంతపురం: కేరళలోని కాలామస్సేరిలో ఆదివారం పేలుళ్లు జరిగాయి. ఓ కన్వెన్షన్ సెంటర్‌లో ప్రార్థనలు జరుగుతున్న సమయంలో పేలుళ్లు జరగడంతో ఒక మహిళ మృతి చెందగా 23 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. వరపుజ, అంగమలి, ఎడపల్లి గ్రామాల నుంచి భక్తులు ప్రార్థన కోసం కాలామస్సేరి నెస్ట్ లోని ఓ కన్వెన్షన్ సెంటర్‌కు వచ్చారు. ప్రార్థనలు జరుగుతున్న సమయంలో హాలు మధ్యలో భారీ పేలుడు సంభవించిడంతో పాటు మరో రెండు మూడు పేలుళ్లు జరిగినట్టు సమాచారం. లొపలి వైపు నుంచి తాళం వేసి ఉండడంతో క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించడం ఆలస్యమైందని పోలీసులు వెల్లడించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News