Monday, December 23, 2024

భారత్‌లో 23 లక్షల ట్విటర్ అకౌంట్లు బ్లాక్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : నిబంధనలను ఉల్లంఘించిన యూజర్లపై ట్విటర్ ( ప్రస్తుత x) కఠిన చర్యలకు దిగుతోంది. జూన్‌జులై నెలల్లో రికార్డు స్థాయిలో 23,95,495 ఖాతాలను బ్లాక్ చేసినట్టు తాజాగా ట్విటర్ వెల్లడించింది. చిన్నారులపై లైంగిక దోపిడీ, అశ్లీలతను ప్రోత్సహించేలా పోస్ట్‌లు చేసిన ఖాతాలే ఇందులో ఎక్కువగా ఉన్నట్టు పేర్కొంది. అంతకుముందు మే 26 నుంచి జూన్ 25 మధ్య నెల రోజుల వ్యవధిలో 5,44,473 ఖాతాలను ట్విటర్ బ్లాక్ చేసిన విషయం తెలిసిందే. అంతేకాకుండా ఉగ్రవాద చర్యలను ప్రోత్సహిస్తూన్న 1772 అకౌంట్లను నిషేధించినట్టు వెల్లడించింది.

గతేడాది ఇదే సమయంలో జూన్ 26 నుంచి జులై 25 మధ్య కాలం లోనే 18,51,022 ఖాతాలను బ్లాక్ చేసినట్టు ట్విటర్ అప్పట్లో పేర్కొంది. ఉగ్రవాద కార్యకలాపాలను ప్రోత్సహిస్తున్న 2865 అకౌంట్లను బ్లాక్ చేసినట్టు వెల్లడించింది. భారత్ తీసుకొచ్చిన నూతన ఐటీ చట్టాలకు అనుగుణంగా ట్విటర్ ప్రతినెలా సమ్మతి నివేదికలను విడుదల చేస్తోంది. ఇందులో భాగంగానే అనైతిక చర్యలకు పాల్పడుతున్న వినియోగదారులపై తీసుకున్న చర్యలను, వినియోగదారుల ఫిర్యాదులకు తాము చూపించిన పరిష్కారాలను వివరిస్తూ ప్రతినెలా నివేదికను విడుదల చేస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News