Friday, November 22, 2024

23 ఎంఎంటిఎస్ రైళ్లు రద్దు..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : నిత్యం పట్టణ ప్రజలకు అందుబాటులో ఉండే ఎంఎంటిఎస్ సేవలు నిలిచి పోనున్నాయి. ఈ మేరకు రైల్వే అధికారులు మొత్తం 23 ఎంఎంటిఎస్ రైళ్లను రద్దు చేస్తున్నట్లు వెల్లడించారు. మౌలాలీ సనత్ నగర్ స్టేషన్‌ల మధ్య జరుగుతున్న నాన్ ఇంటర్ లాకింగ్ కారణంగా ఆదివారం నుండి ఆదివారం నుండి జంటనగరాలలో తిరిగే 23 రైళ్లను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు ప్రకటించారు. ఇందుకు సంబంధించిన వివరాలను వారు వివరిస్తూ…నగరంలో ఎంఎంటిఎస్ ఫేజ్ 2 మరమ్మతుల కారణంగా ఎంఎంటిఎస్ సర్వీసులతో పాటు పలు రైళ్లను రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. అయితే తాజాగా మౌలాలీ- సనత్ నగర్ మధ్య నాన్ ఇంటర్ లాకింగ్ పనులు చురుకుగా సాగుతున్నాయి.

ఇవాళ నుంచి ఈ నెల 11 వరకు 23 ఎంఎంటిఎస్ రైళ్లతో పాటు మొత్తం 51 రైళ్లను రద్దు చేసినట్టు అధికారులు ప్రకటన విడుదల చేశారు. వారు విడుదల చేసిన టైమ్ టేబుల్ చార్ట్ మేరకు ఈ నెల 9 వరకు మూడు ఎంఎంటిఎస్ రైళ్లు , 10 వరకు మరో రెండు , ఈ నెల 11 వరకు 18 ఎంఎంటిఎస్ రైళ్లు రద్దు చేసినట్లు తెలిపారు. అదే విధంగా మౌలాలి అమ్ముగూడ సనత్ నగర్ మార్గంలో నడిచే హైదరాబాద్ సిర్నూర్ కాగజ్ నగర్ , వికారాబాద్ గుంటూరు, రేపల్లే సికింద్రాబాద్ ఎక్స్‌ప్రెస్‌ను షెడ్యూల్ ప్రకారం నిలిచి వేయనున్నారు. హైదరాబాద్‌లోని చర్లపల్లిలో నిర్మిస్తున్న రైల్వే టెర్మినల్‌ను ఈ ఏడాది మార్చి నెలాఖరు నాటికి సిద్ధం చేస్తామని దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News